కరోనా వేళ ఆన్ లైన్ క్లాసులు.. నగ్నంగా వీడియో ముందుకొచ్చి..
విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానిక మీడియా తెలిపింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవలు ప్రకటించారు.
అయితే.. ఈ సెలవల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు పాడు కాకూడదనే ఉద్దేశంతో.. పలు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నారు.
అయితే.. ఈ ఆన్ లైన్ క్లాసులపై హ్యాకర్ల కన్ను పడింది. అంతే.. పాఠాలు కనపడాల్సిన చూట బూతు బొమ్మలు కనపడటం మొదలయ్యాయి. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘జూమ్’లో భద్రతా లోపాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా, తాజాగా సింగపూర్‌లో మరో ఘటన వెలుగుచూసింది.
విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానిక మీడియా తెలిపింది.
దాంతో ఆ యాప్‌ను తమ ఉపాధ్యాయులు వాడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బుధవారం నుంచి సింగపూర్‌లో పాఠశాలలను మూసివేశారు. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు.
తాజాగా తమ కుమార్తె భూగోళ శాస్త్రం పాఠం వింటుండగా, తెరపై అసభ్యకరమైన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయని, ఆ తర్వాత ఇద్దరు పురుషులు అమ్మాయిలను బట్టలు విప్పాలని అడిగారని ఒక తల్లి చెప్పారు.
కావాలనే కొందరు ఈ యాప్ ని హ్యాక్ చేసి ఇలా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ యాప్ వినియోగం ఆపేయాలని పలువురు సూచిస్తున్నారు. పలు ప్రభుత్వాలు కూడా ఈ జూమ్ యాప్ వినియోగం పై షరతులు విధిస్తున్నారు.