ప్రపంచానికి భారత కళాసంపద పరిచయం ... లావోస్ దేశాధినేతలను ప్రధాని మోదీ అరుదైన గిప్ట్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లావోస్ వేదికన భారత సుసంపన్న కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే లావోస్ దేశాధినేతలకు అరుదైన బహుమతులు అందించారు. అవేంటో తెలుసా?
PM Modi Laos Visit
PM Modi Laos Visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటన కొనసాగుతోంది. 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం ఆయన లావోస్ చేరుకున్నారు. గురువారం డిల్లీ నుండి బయలుదేరిన ఆయన లావోస్ లోని వియంటియాన్ విమానాశ్రయంలో దిగగానే ఘన స్వాగతం లభించింది.
పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ లావోస్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా లావోస్ అధ్యక్షుడు థోంగ్లన్ సిసూలిత్, ప్రధానమంత్రి సోనెక్సా దంపతులను ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి భారత సంస్కృతిని, వారసత్వ వైభవాన్ని చాటిచెప్పే అరుదైన కళాఖండాలను జ్ఞాపికలుగా అందించారు. ఇలా ప్రధాని లావోస్ దేశాధినేతలకు అందించిన కళాఖండాల గురించి తెలుసుకుందాం.
PM Modi Laos Visit
లావోస్ ప్రెసిడెంట్ కు నరేంద్ర మోదీ గిప్ట్ :
లావోస్ ప్రెసిడెంట్ థోంగ్లన్ సిసూలిత్ కు ప్రధాని మోదీ అరుదైన బుద్ద విగ్రహాన్ని బహూకరించారు. తమిళనాడుకు చెందిన మీనా వర్క్ కళాకారులు ఎంతో నేర్పుతో రూపొందించిన అరుదైన విగ్రహమిది. ఇది దక్షిణ భారత కళా సంపదకు నిదర్శనం.
వివిధ రకాల మెటల్స్ తో అద్భుతమైన కళాకండాలను సృష్టించే మంచి నైపుణ్యంగల కళాకారులకు తమిళనాడు నిలయంగా వుంది. ప్రాచీనకాలం నుండి అనేక కళాకృతులు ఇక్కడ తయారవుతూ వస్తున్నాయి. చోళుల కాలంలో కాంస్యం, ఇత్తడితో నిత్యావసర, అలంకరణ వస్తువులు తయారుచేసేవారు. ఈ క్రమంలో పుట్టుకువచ్చిందే మీనా కళ. తాజాగా ప్రధాని మోదీ ఈ కళాకారులను ప్రోత్సహించేలా, దక్షిణ భారత సుసంపన్న చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా లావోస్ అధ్యక్షుడికి బుద్దుడి విగ్రహం జ్ఞాపికగా ఇచ్చారు.
PM Modi Laos Visit
లావోస్ అధ్యక్షుడి భార్యకు మోదీ అరుదైన గిప్ట్
లావోస్ అధ్యక్షుడితో పాటు అతడి భార్యకు కూడా భారత సంస్కృతి, కళలను తెలియజేసే అరుదైన బహుమతి అందించారు నరేంద్ర మోదీ. గుజరాత్ లో అరుదైన కళాకారి కుటుంబం సాల్విలు తయారుచేసే పటాన్ పటోల (డబుల్ ఇక్కత్) శాలువాను సందేలి బాక్స్ లో పెట్టి బహూకరించారు. రంగురంగుల పట్టు దారంతో తయారుచేసే ఈ శాలువా చాలా ప్రత్యేకతలను కలిగివుంటుంది.
ఇక ఈ శాలువాను పెట్టిన సందేలి పెట్టె కూడా చాలా విలువైనది. ఈ సందేలి కళ చాలా ప్రాచీనమైనది. గుజరాత్ లోని సూరత్ ఈ పెట్టెల తయారీకి ప్రసిద్ది. ఇది చాలా నైపుణ్యంతో కూడిన చేతిపని. ప్రత్యేకమైన కర్రతో తయారుచేసే ఈ పెట్టెను ఖరీదైన బహుమతులను దాచుకోడానికి, ముఖ్యమైన అతిథులకు బహూకరించేందుకు ఉపయోగిస్తారు.
PM Modi Laos Visit
లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ భారత ప్రధాని మోదీ బహుమతి :
ఇక లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ దంపతులకు కూడా నరేంద్ర మోదీ అరుదైన జ్ఞాపికలను అందచేసారు. ఒంటె ఎముకలను అందంగా చెక్కి మలాకిట్ తో అలంకరించిన అద్భుతమైన బాక్స్ ను అందజేసారు. రాధాకృష్ణుల బొమ్మను కూడిన ఈ బాక్స్ చాలా అద్భుతంగా వుంది.
ఈ అరుదైన జ్ఞాపిక కూడా అంతర్జాతీయ వేదికపై భారత సుసంపన్న కళా సంపదను బయటపెట్టింది. ఒంటె ఎముకలను కళాకత్మకంగా తీర్చిదిద్దిన ఈ పెట్టె చాలా రిచ్ లుక్ కలిగివుంది. ఈ పెట్టె భారత ప్రాచీన కళల గొప్పతనాన్ని తెలియజేసేలా వుంది.