- Home
- International
- చీప్.. వెరీ చీప్.. ప్రపంచంలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు 4వ చెత్త ర్యాంక్ ! మరి భారత్ స్థానమెంత?
చీప్.. వెరీ చీప్.. ప్రపంచంలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు 4వ చెత్త ర్యాంక్ ! మరి భారత్ స్థానమెంత?
Henley Passport Index : ప్రపంచంలో బలమైన పాస్ పోర్ట్ సింగపూర్ ది. పాకిస్థాన్ ది అత్యంత చెత్త పాస్ పోర్ట్స్ జాబితాలో ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి భారత పాస్ పోర్ట్ పరిస్ధితేంటి?

హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2025
Passport : ఆర్థికంగా, భద్రతా పరంగా బలంగా ఉండటమే కాదు మరికొన్ని అంశాలు ఓ దేశ పరపతిని నిర్దారిస్తాయి. ఇలా అంతర్జాతీయ స్థాయిలో మంచి పరపతి కలిగిన దేశాల ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది... అంటే అత్యధిక దేశాలు వీసాలేకుండానే అనుమతిస్తాయి. ఇలా కేవలం పాస్ పోర్ట్ తో యావత్ ప్రపంచాన్ని చుట్టివచ్చే దేశాలున్నాయి. అంటే ఆ దేశాల పాస్ పోర్ట్ అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇలాంటి ఏ దేశం పాస్ పోర్ట్ ఎంత బలమైందో తెలియజేసేదే హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్. ఈసారి ఇందులో టాప్ లో నిలిచిన దేశమేది? దాయాదులు భారత్, పాకిస్థాన్ స్థానాలెంత? తెలుసుకుందాం.
ఇదీ పాకిస్థాన్ దుస్థితి
పాకిస్థాన్ పాస్‌పోర్ట్ మరోసారి ప్రపంచంలోనే బలహీనమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2025 ప్రకారం పాక్ పాస్‌పోర్ట్ వరుసగా ఐదోసారి చెత్త పాస్ పోర్ట్ ర్యాంకులో టాప్ లో నిలిచింది. మొత్తం 106 స్థానాలకుగాను పాక్ చివరినుండి 4వ స్థానంలో నిలిచింది.
పరమ చెత్త పాస్ పోర్ట్ పాకిస్థాన్ ది
పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 103వ స్థానంలో ఉంది. పాక్ కంటే దారుణమైన ర్యాంకుల్లో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. 2024లో 100వ ర్యాంకులో ఉన్న పాక్ పాస్‌పోర్ట్ ఇప్పుడు మరింత దిగజారింది. యెమెన్ లో కలిసి పాకిస్థాన్ ఈ చెత్త రికార్డును పంచుకుంది. ఇక మన పొరుగుదేశాల పాస్ పోర్ట్ ల విషయానికి వస్తే నేపాల్ 101, బంగ్లాదేశ్ 100, శ్రీలంక 98 స్థానంలో నిలిచాయి.
ప్రపంచంలోనే బలమైన పాస్ పోర్ట్ ఏ దేశానిది?
హెన్లీ ఇండెక్స్‌లో సింగపూర్ పాస్‌పోర్ట్ మళ్లీ టాప్ లో నిలిచింది. ఈ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా ఫ్రీగా వెళ్లొచ్చు. దక్షిణ కొరియా, జపాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ టాప్ 10 నుంచి పడిపోయింది... 12వ స్థానంలో నిలించింది. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు సంయుక్తంగా అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాయి... ఈ దేశాల పాస్ పోర్ట్ తో 188 దేశాలకు వీసా లేకుండా వెళ్లిరావచ్చు.
భారత పాస్ పోర్ట్ ర్యాంక్ ఎంత?
హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2025 లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ కూడా పడిపోయింది. మౌరిటానియాతో కలిసి 85వ స్థానానికి చేరింది. ఇప్పుడు భారత పాస్‌పోర్ట్‌తో 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లొచ్చు. భారత పాస్ పోర్ట్ ర్యాంకింగ్ క్రమంగా పడిపోతోంది... దీని అర్థం మన పరపతి కూడా అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతోందని అర్థం. ఇది భారత్ కు ఓ హెచ్చరిక లాంటిది.
ప్రపంచ దేశాలన్నింటి పాస్ పోర్ట్ ర్యాంకింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి