ఏం తెలివి తల్లీ ..! తప్పిపోయిన ఎనిమిదేళ్ల పాప ... ఏటిఎం సాయంతో ఇంటికెలా చేరిందో చూడండి
ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తెలివితేటలకు, సమయస్ఫూర్తికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తన తాతతో కలిసి ఇంటికి వెళ్తుండగా తప్పిపోయిన బాలిక ఏటిఎం సెంటర్ సహాయంతో తిరిగి తన కుటుంబ సభ్యులను చేరుకుంది. అదెలాగంటే...
China Girl
ఈ తరం పిల్లలు చాలా చురుకు... ఒక్కోసారి వారి తెలివితేటలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పెద్దవారికి రాని ఆలోచనలు కూడా చిన్నారులకు వస్తుంటాయి. ఇలా చైనాకు చెందిన ఓ చిన్నారి సమయస్పూర్తితో వ్యవహరించి తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎనిమిదేళ్ల చైనీస్ పాప తెలివితేటలకు ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు.
China Girl
తాతతో కలిసి ఇంటికి వెళుతున్న చిన్నారి రోడ్డుపై తప్పిపోయింది. ఎంత వెతికినా తాత కనిపించలేడు..? చుట్టుపక్కల సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు..? ఇంటికి దారి తెలీదు..? ఇలాంటి సమయంలో ఎవరైనా కంగారుపడిపోతారు... చిన్నపిల్లలు భయంతో ఏడుపు మొదలుపెడతారు. కానీ ఈ చైనీస్ పాప మాత్రం అలా చేయలేదు... తన తెలివితేటలతో ఇంటికి చేరింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
China Girl
అసలేం జరిగింది :
మన పొరుగుదేశం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని క్విజో ప్రాంతంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల (జూలై) 30న ఎనిమిదేళ్ల మనవరాలిని తాత డ్యాన్స్ క్లాస్ నుండి తీసుకుని వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో ఈ తాత మనవరాలు విడిపోయారు... దీంతో ఆ చిన్నారి రోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంది.
ఇంటికి వెళ్లే దారి తెలియదు..? తాతది కాదు కుటుంబసభ్యుల్లో ఎవ్వరి ఫోన్ నెంబర్ ఆమెకు తెలియదు..? సాయం చేయడానికి ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఆ చిన్నారి ఏమాత్రం ఆందోళన చెందలేదు... తన మెదడుకు పనిచెప్పింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని నిశితంగా గమనించి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆమె తెలివిగా ఆలోచించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది.
China Girl
తప్పిపోయి ఏడుస్తూ కూర్చోకుండా అక్కడినుండి ఎలా ఇంటికి చేరవచ్చోనని ఆలోచించింది చిన్నారి. అప్పుడామెకు దగ్గర్లోనే ఒక బ్యాంక్ ఏటిఎం కనిపించింది. ఇదే తనను ఇంటికి చేరుస్తుందని భావించిన చిన్నారి వెంటనే లోపలికి వెళ్లింది. అంతకు ముందు ఏటిఎంను ఉపయోగించిందో లేక కుటుంబసభ్యులు, టీచర్లు చెప్పారో తెలీదుగాని ఏటిఎం మిషన్ గురించి ఆ చిన్నారికి అవగాహన వుంది.
China Girl
చైనాలోని చాలా ఏటిఎం మిషన్లలో అవసరమైతే బ్యాంక్ సిబ్బందికి ఫోన్ చేసే ఆప్షన్ వుంటుంది. దీన్ని ఆ బాలిక ఉపయోగించింది... ఏటిఎం మిషన్ లోని అత్యవసర కాలింగ్ బటన్ నొక్కింది. ఇలా బ్యాంక్ సిబ్బందికి తన పరిస్థితిని తెలియయజేసింది చిన్నారి. వెంటనే బ్యాంక్ సిబ్బంది చిన్నారి గురించి ఆ ఏటిఎం సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. ఇలా పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి వివరాలను తెలుసుకుని ఇంటికి చేర్చారు.
China Girl
ఇలా ఎనిమిదేళ్ల చైనీస్ పాప సమయస్పూర్తితో వ్యవహరించి తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాప గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. సమస్యలు ఎదురయినపుడు తెలివిగా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఈ చిన్నారిని చూసి నేర్చుకోవాలని కొందరు... పెద్దవాళ్లకు కూడా ఇన్ని తెలివితేటలు వుండవని ఇంకొందరు... చైనీయుల తెలివే తెలివి అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చైనా చిన్నారి సమయస్పూర్తిని ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు.