లాంబ్దా వేరియంట్ : యూకేను వణికిస్తున్న మరో కొత్త స్ట్రెయిన్.. ఆరు కేసులు నమోదు !
లాంబ్డా వేరియంట్ : లాంబ్డా అని పిలువబడే కొత్త కరోనావైరస్ వేరియంట్ ఆరు కేసులను గుర్తించినట్లు యుకె శుక్రవారం తెలిపింది, దీనిని పెరూలో మొదట గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ను C.37 స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఈ మ్యుటేషన్‌ను UK ఆరోగ్య అధికారులు "ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్" గా డిజిగ్నేట్ చేశారు.
లాంబ్డా వేరియంట్ : లాంబ్డా అని పిలువబడే కొత్త కరోనావైరస్ వేరియంట్ ఆరు కేసులను గుర్తించినట్లు యుకె శుక్రవారం తెలిపింది, దీనిని పెరూలో మొదట గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ను C.37 స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఈ మ్యుటేషన్‌ను UK ఆరోగ్య అధికారులు "ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్" గా డిజిగ్నేట్ చేశారు.
దీన్ని ఇప్పుడే ఆందోళన కలిగించే వేరియంట్ ల జాబితాలో చేర్చలేమని, అయితే ఈ స్ట్రెయిన్ వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కొట్టిపడేయలేం అని చెబుతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ యూకేను అల్లకల్లోలం చేస్తోంది.
డెల్టా వేరియంట్ UK లో వైరస్ వ్యాప్తిని విపరీతంగా పెంచేస్తుంది. ఇక యూరప్ లోనూ దీని విస్తరణ వేగంగా ఉంది. ఇంగ్లాండ్ పబ్లిక్ హెల్త్ చేసిన ఒక బ్రీఫింగ్ లో లాంబ్డా మ్యూటెంట్ లు ఇతర మ్యూటెంట్ లతో పోల్చితే ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగిఉండొచ్చని అంటున్నాయి.
ఏదేమైనా, ఈ లాంబ్దా వేరియంట్ తీవ్రమైనదనడానికి, టీకాలకు లొంగదు అనడానికి, నిరోధకత ఎక్కుగా కలిగి ఉంది అనడానికి సరైన ఆధారాలు ఇప్పటివరకు లేవు. దక్షిణ అమెరికా దేశాలలో లాంబ్డా పెరుగుతోంది. పెరూలో ఏప్రిల్ నుండి నమోదవుతున్న కరోనావైరస్ కేసులలో 81 శాతం లాంబ్దావే ఉంటున్నాయి. చిలీలో మొదట వెలుగులోకి వచ్చి యూకె వేరియంట్ ఆల్ఫా స్ట్రెయిన్ ను దాటుకుని లాంబ్డా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అర్జెంటీనాలో కూడా, ఫిబ్రవరి నుండి ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. WHO జూన్ 14 న ఈ మ్యుటేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ వైరస్ లకు పేరుపెట్టే సిస్టమ్ ప్రకారం దీనికి లాంబ్డా అనే పేరును పెట్టింది.
గ్లోబల్ డేటాబేస్ కు పంపిన 1,845 లాంబ్డా శాంపిల్స్ లో, సగానికి పైగా చిలీ, పెరూ, యుఎస్ నుండి వచ్చానవే. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లతో సహా అనేక యూరోపియన్ దేశాలలో C.37 లైనేజ్ కేసులు గుర్తించబడ్డాయి.
UK లో ఇవి ఎన్ని కేసులు ఉన్నాయంటే... లండన్‌లో నాలుగు, నైరుతి ఇంగ్లాండ్‌లో ఒకటి, వెస్ట్ మిడ్‌లాండ్స్‌లో ఒకటి ఉన్నాయి. ఇవన్నీ విదేశాలనుంచి వచ్చిన హిస్టరీ ఉన్న వారిలోనే బయటపడ్డాయి. అయితే ఇప్పటివరకు దీనివల్ల మరణాలు ఏవీ నమోదు కాలేదు.
ఈ వేరియంట్ ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రజారోగ్య చర్యలనూ తీసుకుంటామని, అవసరమైన ఎక్స్ ట్రా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ పెంచుతామని UK ప్రభుత్వం తెలిపింది.
యూకే జీనోమిక్ నిపుణులు అంచనా ప్రకారం ఇప్పుడు ఆ దేశంలో 95 శాతం కేసులున్నాయి. PHE వీక్లీ అప్ డేట్ ప్రకారం.. గత వారంలో వేరియంట్ కేసులు 46 శాతం పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 110,000 కన్నా ఎక్కువ ఉన్నాయని తేలింది.
దీంతోపాటు డెల్టా AY.1 చెబుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ వి 42 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 514 మందిని ఆసుపత్రికి తరలించారు, వారిలో 304 మంది టీకాలు తీసుకోనివారు ఉన్నారు.
టీకా వైరస్ మీద ప్రభావవంతగా పనిచేస్తుందని, వ్యాక్సినేషన్ వల్ల వైరస్ గొలుసును తెంపగలుగుతున్నామని, కేసుల సంఖ్యలో తగ్గుదల, ఆస్రత్రుల్లో చేరే వారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతుందని డేటా సూచిస్తోందని UK ఆరోగ్య భద్రతా సంస్థ హెడ్ డాక్టర్ జెన్నీ హారిస్ అన్నారు.
ఇది నిజంగా సంతోషకరమైన సమాచారం.. కాకపోతే దీంతో సంతృప్తి చెందలేం అని కూడా అన్నారామె. ఫ్రాన్స్, జర్మనీతో సహా ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో డెల్టా కూడా పెరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు.
70శాతం ఈ వేరియంట్ కేసులు బయటపడ్డ ల్యాండ్స్, నైరుతి విభాగంలో ఫ్రాన్స్ పరీక్షలు పెంచింది. టీకాలు వేగవంతం చేసింది. ప్రాన్స్ లో ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో పది శాతం డెల్టా వేరియంట్ ఉంది. ఇది గతవారంలో 2 శాతం నుండి 4 శాతానికి పెరిగింది.
ఇక జర్మనీలో, 15 శాతం కొత్త డెల్టా వేరియంట్ కేసులు ఉన్నాయి. జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ చేపట్టిన వైరస్ వ్యతిరేక చర్యలతో ఇది ఈ స్థాయిలో ఉంది. డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉన్న దేశాలనుంచి వచ్చిన ప్రయాణికులను అనుమతించడంలో జాగ్రత్తగా ఉండాలని ఈయూకి పిలుపునిచ్చారు. ఈ దేశాల్లో యూకే కూడా ఉంది.
జర్మనీలో మాదిరిగానే యూరోపియన్ దేశాలు కూడా బ్రిటిష్ ప్రయాణికుల మీద నిర్బంధం విధించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.