MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలకు 3 వేల సమాధులు సిద్ధం.? అస‌లేం జ‌రుగుతోంది.?

ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలకు 3 వేల సమాధులు సిద్ధం.? అస‌లేం జ‌రుగుతోంది.?

Khamenei Last Rites: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు, వివిధ దేశాల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలు అపూర్వ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 07 2026, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్షలాది మంది మధ్య కొనసాగుతున్న అంతిమయాత్ర
Image Credit : Asianet News

లక్షలాది మంది మధ్య కొనసాగుతున్న అంతిమయాత్ర

టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ప్రారంభమైన ఖమేనీ అంతిమయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పవిత్ర నగరమైన ఖోమ్‌కు తరలించారు. అక్కడి నుంచి ఇరాక్‌లోని పవిత్ర ప్రాంతాల్లో కూడా నివాళుల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరగా జూలై 9న ఖమేనీ స్వస్థలమైన మషద్‌లో ఖననం చేయనున్నట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఖమేనీ కుటుంబ సభ్యులు సమాధి అయిన ప్రాంతానికి సమీపంలోనే ఆయనకు స‌మాధి నిర్మించ‌నున్న‌ట్లు సమాచారం. వారం రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమాలకు దేశీయ, విదేశీ అతిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
3 వేల సమాధులు సిద్ధం చేశారన్న కథనాల వెనుక కారణం
Image Credit : ANI

3 వేల సమాధులు సిద్ధం చేశారన్న కథనాల వెనుక కారణం

జర్మనీకి చెందిన WELT అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, టెహ్రాన్‌లోని బెహెష్త్-ఎ-జహ్రా స్మశానవాటికలో వేల సంఖ్యలో సమాధులను ముందుగానే సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ జనసందోహం, తొక్కిసలాట వంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. కొన్ని అంతర్గత రిపోర్టుల ఆధారంగా, అత్యంత దారుణ పరిస్థితులు ఎదురైనా స్పందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ వివరాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

35
2020 ఘటనతో అప్రమత్తమైన అధికారులు
Image Credit : x

2020 ఘటనతో అప్రమత్తమైన అధికారులు

2020లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసెమ్ సులేమానీ అంత్యక్రియల సమయంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా మరణించిన ఘటన ఇప్పటికీ ఇరాన్‌ను వెంటాడుతోంది. ఆ సమయంలో లక్షలాది మంది పాల్గొనడంతో పరిస్థితి అదుపు తప్పి వందలాది మంది గాయపడ్డారు. అదే తరహా పరిస్థితి మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ఈసారి అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసర వైద్య బృందాలు, అంబులెన్సులు, ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.

45
అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం
Image Credit : X

అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం

ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. పలువురు మతపెద్దలు, రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి సంకేతంగా భావించే ఎరుపు జెండాలను ప్రదర్శించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఇరాన్‌తో పరిస్థితిపై స్పందిస్తూ, దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా విశేష చర్చకు కారణమయ్యాయి.

55
పశ్చిమాసియాలో మరింత పెరిగిన ఉద్రిక్తత
Image Credit : X

పశ్చిమాసియాలో మరింత పెరిగిన ఉద్రిక్తత

ఖమేనీ మరణం తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. అంత్యక్రియల కోసం వివిధ దేశాల ప్రతినిధులు టెహ్రాన్ చేరుకోగా, భద్రతను అత్యున్నత స్థాయికి చేర్చారు. మరోవైపు కొత్త నాయకత్వంపై కూడా అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

ఇరాన్ భవిష్యత్ రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ భద్రత, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. భారీ జనసందోహం మధ్య జరుగుతున్న ఈ అంత్యక్రియలు పశ్చిమాసియా రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Recommended image2
Chicken facts: చికెన్ పేద‌ల ఆహారమా.? అందుకే కోడి మాంసానికి చికెన్ అని పేరు వచ్చిందని తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved