MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• వైట్ హౌస్ కు ఆ పేరెలా వచ్చింది? ఇందులో బాత్రూంలే ఎన్నున్నాయో తెలుసా?

వైట్ హౌస్ కు ఆ పేరెలా వచ్చింది? ఇందులో బాత్రూంలే ఎన్నున్నాయో తెలుసా?

అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?  ఆ పేరు వెనక ఓ ఆసక్తికరమైన స్టోరీ వుంది.

3 Min read
Arun Kumar P
Published : Jan 22 2025, 06:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14
White House

White House

White House (శ్వేత సౌదం) : ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా... అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అంటారు. అలాంటి పవర్ ఫుల్ దేశానికి అధ్యక్షుడంటే ఓ రకంగా ప్రపంచానికే అగ్రనేత. ఆయన కుటుంబసమేతంగా నివాసముండే అధికారిక భవనమే వైట్ హౌస్. ఇంతకాలం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన జో బైడెన్ ఈ భవనాన్ని ఖాళీచేయగా మరోసారి ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

అమెరికా అధ్యక్షుడి అధికారిక క్యాంప్ ఆఫీస్ అంటే మామూలుగా వుంటుందా... సకల సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపించేలా వుంటుంది వైట్ హౌస్. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి లోకి 1600 పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో వుంది. ఇది 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన రాజభవనం అని చెప్పాలి.

24
White House

White House

వైట్ హౌస్ కు ఆ పేరు ఎలా వచ్చింది?

వైట్ హౌస్ అంటే తెల్లని భవనం అని అర్థం. ఆరంభంలో దీన్ని ప్రెసిడెంట్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ మాన్షన్, ప్రెసిడెంట్ హౌస్ అని పిలిచేవారు. దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ భవనానికి వందేళ్ల పాటు ఈ పేర్లతోనే పిలవబడింది. అనుకోకుండా చోటుచేసుకున్న పరిణామాలు ఈ పేర్లను మార్చాయి.

1814 సంవత్సరంలో జరిగిన యుద్దంలో బ్రిటిష్ సైన్యం అమెరికా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి దహనం చేసింది. ఈ భవనంమొత్తాన్ని ధ్వంసం చేయడమే కాదు నిప్పంటించడంతో గోడలన్ని కాలిపోయి నల్లగా మారిపోయాయి. ఆ తర్వాత దీనిని పునర్మించిని కాలిపోయి నల్లగామారిన గోడలకు తెల్లటి పెయింట్ వేసారు. అప్పటినుండి దీన్ని వైట్ హౌస్ పిలవడం ప్రారంభమయ్యింది.

అయితే చాలాకాలం ప్రజల్లో వైట్ హౌస్ గా గుర్తించబడినా అధికారికంగా మాత్రం గుర్తించబడలేదు. కానీ 1901 లో ఆనాటి అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్ట్ అధ్యక్ష భవనానికి అధికారికంగా వైట్ హౌస్ గా నామకరణం చేసారు. అప్పటినుండి తెల్లగా మెరిసిపోయే ఈ భవనానికి వైట్ హౌస్ పేర్ ఫిక్స్ అయ్యింది.

34
White House

White House

వైట్ హౌస్ నిర్మాణానికి అప్పట్లోనే ఎంత ఖర్చయ్యిందో తెలుసా?

1792 లో జార్జ్ వాషింగ్టన్ అధ్యక్షుడి కోసం ఓ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. ఇందుకోసం స్థలం కేటాయించి నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ భవననిర్మాణం ఎనిమిదేళ్లపాటు కొనసాగింది. ఇలా వాషింగ్టన్ హయంలో ప్రారంభమైన నిర్మాణం 1800 లో జామ్ ఆడమ్స్ హయాంలో పూర్తయ్యింది.

ఈ భవన నిర్మాణానికి అప్పట్లోనే భారీగా ఖర్చుచేసారు. మొత్తం 13 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఒక్కో అధ్యక్షుడు ఈ భవనానికి అవసరమై మెరుగులు దిద్దుతూ వస్తున్నారు. ఒబామా అధ్యక్షుడిగా వుండగా వైట్ హౌస్ లో ఆర్గానికి గార్డెన్ ఏర్పాటుచేసాడు.  అందులో తేనెటీగల పెంపకాన్ని ఇప్పటికీ చేపడుతున్నారు.

44

घर के लिविंग रूम की सजावट के लिए कई आइटम्स नेशनल गैलरी ऑफ आर्ट से मंगवाए गए थे। कई आकर्षक पेंटिंग्स से, जिनका मतलब काफी गहरा है, उससे कमरा सजाया गया था।

घर के लिविंग रूम की सजावट के लिए कई आइटम्स नेशनल गैलरी ऑफ आर्ट से मंगवाए गए थे। कई आकर्षक पेंटिंग्स से, जिनका मतलब काफी गहरा है, उससे कमरा सजाया गया था।

వైట్ హౌస్ లో ఏమేం వున్నాయి?

వైట్ హౌస్ 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆరు అంతస్తుల భవనం. ఈస్ట్ వింగ్, వెస్ట్ వింగ్ మధ్యలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ రెసిడెన్సీ వుంటుంది. ఇందులో 132 గదులున్నాయి... ఇందులో 35 స్నానపుగదులు(బాత్రూంలు) వున్నాయి. 412 తలుపులు, 147 కిటికీలు, మూడు ఎలివేటర్లు వున్నాయి.

వైట్ హౌస్ లో అధ్యక్ష కుటుంబానికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఇందులో ఓ టెన్నిస్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, బౌలింగ్ అల్లే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ ఫూల్ వుంది.  ప్రెసిడెంట్ ఫ్యామిలీ కోసం ఓ సినిమా థియేటర్ కూడా వుంది. ఒకేసారి 140 మంది కూర్చుని తినడానికి వీలుగా అతిపెద్ద డైనింగ్ టేబుల్ వుంది. ఈ వైట్ హౌస్ నిర్వహణలో మొత్తం 5,700 మంది ఉద్యోగులు పనిచేస్తారు.

వైట్ హౌస్ లో అధ్యక్షుడి నివాసం, అధికారిక కార్యకలాపాల విభాగం వేరువేరుగా వున్నాయి.  పశ్చిమ భాగంలో అధికార కేంద్రం  వుంది. అధ్యక్షుడు, సిబ్బంది పనిచేసుకునేలా కార్యాలయాలు, సమావేశాలు జరిపేందుకు క్యాబినెట్ గది కూడా ఇందులో ఉన్నాయి. సిట్యుయేషన్ రూమ్ కూడా ఇక్కడే ఉంది. ఇందులో సురక్షితమైన, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలతో అమర్చబడి ఉండటం వలన ఇక్కడినుండి అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూఎస్ దళాలను ఆదేశించడం సాధ్యమవుతుంది.

ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అని పిలువబడే ఒక భూగర్భ కమాండ్ సెంటర్ కూడా  వైట్ హౌస్ కింద ఉంది. ఇక్కడ అధ్యక్షుడు మరియు ముఖ్య సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా తలదాచుకునేందుకు ఆస్కారం వుంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
డొనాల్డ్ ట్రంప్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved