- Home
- International
- Elon Musk New Girlfriend : కొత్త ప్రేయసితో కెమెరాకు చిక్కిన ఎలన్ మస్క్.. ఆమె ఎవరంటే...
Elon Musk New Girlfriend : కొత్త ప్రేయసితో కెమెరాకు చిక్కిన ఎలన్ మస్క్.. ఆమె ఎవరంటే...
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరో అమ్మాయితో డేటింగ్ మొదలు పెట్టాడు. డేటింగ్లో ఏకంగా ఒక బిడ్డను కన్న తర్వాత.. ప్రేయసి గ్రిమ్స్ కు టాటా చెప్తున్నాడు అంటూ.. ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే తాజాగా మస్క్ ఓ ముసుగురాణితో అడ్డంగా దొరికిపోయాడు. కాగా.. ఆమె ఎవరో ఆచూకీ పట్టేసింది బ్రిటన్ మీడియా.

లాస్ ఏంజెల్స్ లో తన ప్రైవేట్ జెట్ వద్ద Elon Musk, ఓ యువతితో దిగుతూ కనిపించాడు. పొడుగాటి కోటు, నల్ల కళ్ళద్దాలు ధరించిన ఆ యువతి.. కెమెరాలు కనిపించేసరికి తన ముఖం చాటేసేందుకు ప్రయత్నించింది. ముఖాన్ని కప్పేసుకుని వేగంగా అక్కడి నుంచి పరుగులు అందుకుంది. ఆమెను అనుసరిస్తూ మస్క్ సైతం కారు దగ్గరికి పరుగులు తీశాడు. ఈ తరుణంలో డైలీ మెయిల్ పత్రిక.. మస్క్ తో ఉన్న ఆమె ఆస్ట్రేలియా నటీ Natasha Bassett అని తేల్చింది.
Image: Getty Images
ఎవరీ నటాషా…
20 ఏళ్ల నటాషా beset సిడ్నీలో పుట్టి, పెరిగింది. 14 ఏళ్ళకే ఆమె యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. యాక్టింగ్ కోసం 2019లో న్యూయార్క్ కు వెళ్ళింది. నటిగానే కాదు.. జంతు పరిరక్షణ ఉద్యమకారిణిగా, గ్లోబల్ వార్మింగ్ ఉద్యమకారిణిగా ఆమెకు పేరుంది. ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరు ఫోటోలు బయటకు రాగానే ఓ మీడియా హౌస్ నటాషాను ఇంటర్వ్యూ చేసింది. తాను మస్క్ బ్యాంకు బ్యాలెన్స్ చూసి ప్రేమించ లేదని.. ఆయన మేధస్సును చూసి ఇష్టపడ్డాను అని ఆమె వెల్లడించింది. ఇదిలా ఉంటే ఓ ఈవెంట్ లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. తర్వాత మంచి స్నేహితులు అయ్యారట. గ్రిమ్స్ తో మస్ దూరం అయ్యాక.. ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.
అయ్యగారి list..
గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్ ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా 2004లో కవలలు, 2006లో త్రిబులెట్స్ (ఒకే కాన్పులో ముగ్గురు)ని కన్నది ఈ జంట.
Elon Musk and Grimes

ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేతో డేటింగ్ చేశాడు. 2010లో రిలేను వివాహం చేసుకుని 2012లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మాస్క్.. చివరికి 2016లో రిలేకు సైతం విడాకులు ఇచ్చేశాడు.
ఆ తర్వాత దక్కిన ఫేమ్, డబ్బుతో సెలబ్రిటీలతో కొంత కాలం డేటింగ్ చేశాడు. 2017లో నటి అంబర్ హర్డ్ తో కొంత కాలం డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపించగా.. హార్ట్ మాజీ భర్త డెప్ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు. అయితే మస్క్, హర్డ్ లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. 2018 నుంచి కెనడియన్ సింగర్ గ్రిమ్స్ (క్లెయిర్ బౌచర్)తో డేటింగ్ మొదలు పెట్టాడు మస్క్.
2020 మే నెలలో వీళ్లిద్దరికీ ఓ కొడుకు పుట్టగా.. ఎవరికీ అర్థం కాని రీతిలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకుని చాలాసార్లు కెమెరా కళ్ళకు చిక్కింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంది.. అయినా కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసి చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.