- Home
- International
- ప్రొటీన్ డ్రింక్ తాగి, అరుదైన వ్యాధి బారిన పడి 16యేళ్ల బాలుడు మృతి.. అధికారులు ఏమంటున్నారంటే...
ప్రొటీన్ డ్రింక్ తాగి, అరుదైన వ్యాధి బారిన పడి 16యేళ్ల బాలుడు మృతి.. అధికారులు ఏమంటున్నారంటే...
లండన్‌కు చెందిన రోహన్ గోధానియా, 16, ఆగస్టు 15, 2020న ప్రోటీన్ షేక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఆ తరువాత మరణించాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

లండన్ : ప్రొటీన్ తాగి 16 ఏళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన తర్వాత ప్రొటీన్ డ్రింక్స్ మీద ఆరోగ్య హెచ్చరికలను జోడించాలని సీనియర్ యూకే అధికారి తెలిపారు. లండన్‌కు చెందిన 16 ఏళ్ల రోహన్ గోధానియా ఆగస్టు 15, 2020న ప్రొటీన్ షేక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. మూడు రోజుల తర్వాత వెస్ట్ మిడిల్‌సెక్స్ హాస్పిటల్‌లో 'మెదడు కోలుకోలేని విధంగా దెబ్బతినడంతో' మరణించాడు.
అతను మరణించిన వెంటనే, ఆసుపత్రి అతని అనారోగ్యానికి కారణాన్ని గుర్తించేలోపు అతని అవయవాలను దానం చేశారు. రోహన్ సన్నగా ఉండేవాడు. తన కొడుకు కాస్త బలంగా తయారవ్వాలని బాలుడి తండ్రి కండరాలను పెంచడంలో సహాయపడే డ్రింక్ కొన్నాడు అన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయి.
ప్రొటీన్ షేక్ వల్ల ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ (ఓటీసీ) డెఫిషియన్సీ అనే అరుదైన జెనెటిక్ కండిషన్ కు గురయ్యాడు. దీనివల్ల రోహన్ రక్తప్రవాహంలో అమ్మోనియా విచ్ఛిన్నం అయ్యింది. అది ప్రాణాంతక స్థాయికి చేరుకుంది అని మీడియా సంస్థలు నివేదించాయి.
<p><b>\</b></p><p><b>1.గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్ షేక్..</b></p><p><b>బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేసే అలవాటు మీకు ఉంటే... పడుకునే ముందు ఈ ప్రోటీన్ షేక్ తాగితే చాలా మంచిది. సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా దానిలో ఉండే ప్రోటీన్ మజిల్స్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని క్యాలరీస్ మొత్తం తగ్గిపోతాయి. ఇక పాలల్లో ఉండే కాల్షియం మనకు మంచి నిద్రను కూడా అందిస్తుంది. ఈ ప్రోటీన్ షేక్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.</b><br /> </p>
బకింగ్‌హామ్‌షైర్‌లోని మిల్టన్ కీన్స్ కరోనర్ కోర్టులో జరిగిన విచారణలో అరుదైన వ్యాధి, ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ (ఓటీసీ) డెఫిషియన్సీతో బాలుడి మరణానికి కారణాన్ని పోస్ట్‌మార్టం పరీక్షలో ప్రాథమికంగా గుర్తించలేకపోయామని నివేదించింది.
ఈ వ్యాధి వల్ల అమ్మోనియా విచ్ఛిన్నతను నిరోధిస్తుందని, దీనివల్ల రక్తప్రవాహంలో ప్రాణాంతక స్థాయికి చేరుతుందని తెలిపింది. ఇలా జరగడానికి ప్రోటీన్ లోడ్ ఎక్కువవ్వడం కూడా కారణం అన్నారు.
కరోనర్ టామ్ ఓస్బోర్న్ మాట్లాడుతూ.. ప్రోటీన్ డ్రింక్స్ గురించి తన ప్రాథమిక అభిప్రాయం చెప్పుకొచ్చారు..
‘ఈ పానీయాల ప్యాకేజింగ్‌పై ఒక విధమైన హెచ్చరిక ముద్రించాలని..నేను రెగ్యులేటరీ అధికారులలో ఒకరికి వ్రాయవలసి ఉంటుంది, ఎందుకంటే ఓటీసీ చాలా అరుదైన పరిస్థితి. ఎవరైనా ప్రోటీన్ షేక్ తాగి ఇలాంటి హానికరమైన ప్రభావాలను లోనయ్యే అవకాశం ఉంది. ప్రోటీన్ స్పైక్‌కు కారణమవుతుంది" అన్నారు.