MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Hyderabad
  • Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. వేలాది మందికి కొత్త ఉద్యోగాలు

Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. వేలాది మందికి కొత్త ఉద్యోగాలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనిరవార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఏఐకి అడ్డాగా మారుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి..  

2 Min read
Narender Vaitla
Published : Feb 14 2025, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Goolge Microsoft

Goolge Microsoft

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఏఐ శ్రీకారం చుట్టనుందని ఇప్పటికే టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని అంటున్నా, దీంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా టెక్ దిగ్గజాలు ఇప్పటికే ఏఐని విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్‌తో పాటు, గూగుల్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఏఐని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపింది. 

23
Google AI

Google AI

గూగుల్ ప్రతినిధులతో సమావేశం.. 

హైదరాబాద్‌లో తన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ప్రభుత్వంతో కలిసి కృత్రిమే మేధ ఆధారిత సేవలు అందించేందుకు గూగుల్‌ గురువారం ఒప్పందం కుదురుచ్చుకుంది. ఇందులో భాగంగానే గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల సమక్షంలో  గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతి లోబానాతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు. వ్యవసాయం, పరిపాలన, రవాణా విద్యా వంటి కీలక రంగాల్లో ఏఐ సేవలను అమలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఏఐ నైపుణ్యాలు పెంచే దిశగా గూగుల్‌ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్‌ అభ్యసన పద్ధతులను ప్రారంభిస్తుంది.

ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత తెలంగాణ దార్శనికతకు గూగుల్‌ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనలో గూగుల్‌తో ఒప్పందం కీలకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 

33
microsoft

microsoft

మైక్రోసాఫ్ట్‌ విస్తరణ.. 

ఇదిలా ఉంటే మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ విస్తరణతో వేలాది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. 

అదే విధంగా మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఎడ్యుకేషన్​ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యంత్రి తెలిపారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకోనున్నట్టు చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్‌ కొత్త కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. 
 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Recommended image2
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...
Recommended image3
Jubilee Hills గడ్డపై కాంగ్రెస్ జెండా పాతేశాడుగా.. ఎవరీ నవీన్ యాదవ్? అతడి సక్సెస్ స్టోరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved