MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Hyderabad
  • Mastan Sai: అమ్మాయిలు జాగ్రత్త.. 'మస్తాన్ సాయి'లాంటి సైకోలున్నారు, తొందరపడ్డారో జీవితం నాశనమే

Mastan Sai: అమ్మాయిలు జాగ్రత్త.. 'మస్తాన్ సాయి'లాంటి సైకోలున్నారు, తొందరపడ్డారో జీవితం నాశనమే

రాజ్‌ తరుణ్‌-లావణ్యల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మస్తాన్‌ సాయి పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్‌ సాయి చెప్పిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ క్రమంలో మస్తాన్‌ సాయి లాంటి వారితో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? అసలు ఇలాంటి వికృతాలకు సోషల్‌ మీడియా ఎలా కారణమవుతుంది.? లాంటి వివరాలను అమర్‌నాథ్‌ వాసిరెడ్డి గారు తన ఫేస్‌బుక్‌ వాల్‌పై పోస్ట్‌ చేసిన వివరాలు మీకోసం..  

4 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 05 2025, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mastan Sai case

Mastan Sai case

ఫ్రంట్ దేర్ ఈజ్  క్రోకడైల్ ఫెస్టివల్ ! (సున్నిత మనస్కులు ఈ పోస్ట్ చదవొద్దు)

వాడో ... యు ట్యూబర్. అచ్చ తెలుగు లో చెప్పాలంటే గొట్టం గాడు. (కాగితం మంట.... మూన్నాళ్ళ    ముచ్చట . అదో వృత్తి . దానికో...  తొక్కలో ఆదాయం . బుద్ధి జ్ఞానం లేకపోతె సరి). డి గ్లామర్ చూసి , పేరుప్రఖ్యాతులు చూసి కొంత మంది అమ్మాయిలు పడిపోయారు. అవును మరి .. కాస్త ఎర్రగా బుర్రగా కండలతో ఉంటే "హ్యాండ్సమ్ హంక్"  అని కొంత మంది వెంపర్లాడి పోతారు . సినిమాలు ముఖ్యంగా... ఓటిటి చేసిన బ్రెయిన్‌ వాష్‌ అదే మరి . "ప్రిన్స్ " " రెబెల్ "  అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతారు .. ఇదే కదా తెలుగు సినిమాల్లో పదేపదే చూపేది. 

డబ్బు ఆశ చూపి వాడు... కొంతమందిని లోబరుచుకొన్నాడు. 'ఉన్నది ఒకటే లైఫ్ ..అబ్బాయిలు బకరాలు . మన గ్లామర్ చూసి సొంగ కార్చుకొని ఎంతైనా ఖర్చుపెడుతారు . మస్తు మజా చేసుకొందాము .. జస్ట్ ఛిల్ల్ యార్'.. ఇదే కదా సోషల్  మీడియా నేర్పుతున్న పాఠం. డ్రగ్స్ తో వాడు మరికొంతమందిని లోబరుచుకొన్నాడు. బ్రీజర్ .. బార్ కోడ్.. అటు పై బకార్డి .. టెకిలా...  షాట్స్ .. సంవత్సరం గడిస్తే డ్రగ్స్ .. ఇదే నేటి యువతీ యువకుల ప్రగతి మార్గం. మధ్య తరగతి .. హై క్లాస్ .. అంటూ తేడాలు లేవు. స్మార్ట్ ఫోన్ సొల్లు  జెనెరేషన్ లో ఇప్పుడు మెజారిటీ ది ఇదే దారి. ఒకప్పుడు ప్రేమలేఖలు .. ప్రేమ .. "ఏదయినా పెళ్ళయాక "అనే వారు అమ్మాయిలు.

23

ఇప్పుడు చిటికలో బెడ్ రూమ్ దారి పట్టే అమ్మాయిలు  ఎంతో మంది. 'గొట్టం గాళ్ళు'.. రేడియో జాకీలు .. డబ్బు... పేరు ... తెలివి (చావు తెలివి) ఉన్న ప్రతోడు దున్నుకొంటున్నాడు. ఎప్పుడో వార్తలు బయటకు వస్తాయి . అరెస్ట్ లు జరుగుతాయి . అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోతుంది. కరోనా ముందు కాలం లోనే తార్నాకకు చెందిన ఇంజనీర్ 130 అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అని క్రైమ్ వార్తలు వచ్చాయి . ఇప్పుడు ఈ వస్తాను సాయి ..

ఇంకో రేడియో జాకీ ... అని వార్తలు. మూడు  వందలో.. రెండు  వందలో.. నంబర్స్ ఎలా ఉన్నా.. వాడు అనేక మందిని ట్రాప్ చేసి ... వారితో సెక్స్ చేసి .. ఆ దృశ్యాలని వీడియో షూట్ చేసి... వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పుడేమయ్యింది ?  వాడు అరెస్ట్ అయ్యాడు ....  ఈ అమ్మాయిలు ఎవడో బకరా గాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోతారు . లేదా కొంతమంది రీల్స్ చేసుకొంటూ బతికేస్తారు . కలికాలంలో ఆకు ... వచ్చి   పడినా  ముల్లుకే నష్టం " అని మీరు అనుకొంటున్నారు కదా ! 


నిజం ఏమిటంటే ..

1) వాడు శారీరకంగా కలిసినప్పుడు వారు బాగానే ఎంజాయ్ చేసివుంటారు . కానీ వాడు వీడియోలు చూపి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాక వారు ట్రామా కు గురై ఉంటారు. వారికి భవిషత్తులో సెక్స్ ఫీలింగ్స్ రావడం కష్టం . సెక్స్ చేసినా ఉపచేతన మెదడులో నిక్షిప్తమయిన భయం .. బయటకు వస్తుంది . సెక్స్ సమయంలో  వారిలో ద్రవాలు స్రవించవు. విపరీతమైన నొప్పి వేస్తుంది. 

2) పీడకలలు .. నిద్రలేమి .. అనేక  సంవత్సరాల పాటు వారిని వెంటాడుతుంది . 

3) తలనొప్పి.. మైగ్రైన్.. అజీర్తి లాంటి సమస్యలు వారికి ఇప్పటికే కామన్ అయిపోయి ఉంటుంది. 

4) ట్రామా  వల్ల వారికి హార్మోనల్  మార్పులు వస్తాయి . రుతుస్రావం గతితప్పుతుంది . హెవీ బ్లీడింగ్ కామన్ అయిపోతుంది . రేపు వారు గర్భం ధరించే అవకాశం తక్కువ . థైరాయిడ్ సమస్య రావొచ్చు . వస్తే అదో నరకం. 

5) పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ .. వ్యాకులత .. మానసిక కుంగుబాటు .. ఇక భవిషత్తులో ఎవరినీ నమ్మరు . పెళ్లి చేసుకోలేరు, చేసుకొన్నా కాపురం నిలవవు. అన్ని సమస్యలు అందరికీ వస్తాయని కాదు . కనీసం ఒకటో మూడో అందులో సింహ భాగం అమ్మాయిలకు గ్యారెంటీ. ఒక రోజు థ్రిల్ .. జీవితం కిల్.  ఇక మిగిలింది నిల్ . ఏంటి అమ్మాయిలకే ఈ శిక్ష అనుకొంటున్నారా ?
లింగ బేధాలు లేవు. వయసు తో నిమిత్తం లేదు.

33

సోషల్ మీడియా లో ఎవరో ఒక అమ్మాయి "హాయ్" అంటుంది . సొంగ కార్చేసాడు ఒక అంకుల్ . నెంబర్ అడుగుతుంది . ఇస్తాడు . వీడియో కాల్ వస్తుంది . తాను బట్టలు తీస్తుంది . "అమ్మాయే  బట్టలు తీస్తే నేను తీయలేనా? "  అని మొదలెడుతాడు . అదిగో అదే హనీ ట్రాప్ . అమ్మాయిలయినా...  ఆంటీలు అయినా... అబ్బాయిలయినా... అంకుల్స్ అయినా...  తాతలయినా .. మనుషులకు అందరికీ వర్తించేది ఇదే. సెక్స్ సున్నితం . అడ్డ దారిలో వెళితే ఒక రోజు మస్తు సుఖం . అటు పై జీవితం నరకం.  అన్నట్టు వస్తాను సాయి గాడి జీవితం ఇప్పుడు జైలు పాలు. అమ్మాయిని మరో పదేళ్లు చూడలేడు. దేవుడు/ ప్రకృతి మనిషికి ఇంత అని సుఖం ఇస్తుంది . అడ్డదారిలో వెళితే బతుకు బస్టాండ్. ఎప్పుడూ స్మార్ట్ చేతిలో పెట్టుకొని ఏదో లోకంలో విహరిస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్పండి. 

ఈ మాట ... ఒకే సారి అమిత సుఖం కావాలా ? అది ఒక నెలో మహా అంటే రెండేళ్లు . అలా కాకుండా జీవితాంతం .. ప్రతి రోజు .. ఆనందం కావాలా ? తేల్చుకోమనండి . మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ స్మార్ట్ ఫోన్ గొడ్లకు అర్థం కావాలని ఘాటయిన భాష వాడాను. వద్దన్నా ఇక్కడి దాక చదివిన సున్నిత  మనస్కులకు సారీ .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
TRS Party :''ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''... కవితకు కేసీఆర్ మాస్ మసాలా కౌంటర్
Recommended image2
Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image3
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved