Viral: వందేళ్ల క్రితం ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చూశారా.? కిరోసిన్‌తో పనిచేసేది
ఒకప్పుడు ఫ్రిడ్జ్ అంటే కేవలం ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండే ఓ లగ్జరీ వస్తువు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా ఫ్రిడ్జ్ ఉండే రోజులు వచ్చేశాయ్. గడిచిన 20 ఏళ్లలోనే ఫ్రిడ్జ్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వందేళ్ల క్రితమే ఫ్రిడ్జ్‌లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.?
- FB
- TW
- Linkdin
Follow Us
)
old fridge video
ప్రస్తుతం ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదనే చెప్పాలి. పూరి గుడిసెల్లో ఉండే వారు కూడా ఫ్రిడ్జ్‌లను ఉపయోగిస్తున్నారు. ధరలు తగ్గడం, కంపెనీలు ఈఎమ్‌ఐ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున ఫ్రిడ్జ్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్ నడవాలంటే కచ్చితంగా కరెంట్ ఉండాల్సిందే. ఇందులో వేరే ఆప్షన్ ఉండదు. అయితే వందేళ్ల క్రితం ఫ్రిడ్జ్‌లో ఎలా పనిచేసేవో తెలుసా.?
Viral video Fridge
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పాత ఫ్రిడ్జ్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫ్రిడ్జ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొన్నారు. కరెంట్‌లేని రోజుల్లో ఈ ఫ్రిడ్జ్ కిరోసిన్‌తో పనిచేసేది. ఇందుకు అనుగుణంగానే ఫ్రిడ్జ్ అడుగు భాగంలో కిరోసిన్‌ను పోసే ఒక ట్యాంక్ ఉంది. 10 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ ఉన్న ఈ ఫ్రిడ్జ్ పేరు హిమ్‌లక్స్ కంపెనీకి చెందినదిగా వీడియోలో కనిపిస్తోంది.
ఇంతకీ కిరోసిన్‌తో ఫ్రిడ్జ్ ఎలా నడుస్తుందంటే.?
ట్యాంక్ కింది భాగంలో ఒక దీపం ఉంది. దానిని వెలిగిస్తే ఫ్రిడ్జ్ పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ మంట నీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌లను మండిస్తుంది. దీంతో ఒక గ్యాస్ విడుదల అవుతుంది. ఈ గ్యాస్ ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అమర్చిన పైప్ ద్వారా ఆ గ్యాస్ ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశించి అందులోని పదార్థాలను చల్లగా ఉంచుతుంది. చల్లదనం ఎక్కువగా కావాలనుకుంటే మంటను పెంచితే సరిపోతుంది. మంటను తగ్గిస్తే కూలింగ్ తగ్గుతుంది.
Viral video Fridge
వందల ఏళ్ల క్రితం భారతదేశానికి చెందిన కొందరు ధనవంతులు ఫ్రాన్స్, లండన్ లాంటి దేశాల నుంచి ఇలాంటి ఫ్రిడ్జ్‌లను దిగుమతి చేసుకునే వారని తెలుస్తోంది. అయితే అప్పట్లోనే వీటి ధర వేలల్లో పలికేవి అంటే. కేవలం కొంతమంది ఇల్లలోనే ఇవి ఉండేవి. కరెంట్ లేని రోజుల్లో కూడా ఫ్రిడ్జ్‌లు ఉన్నాయంటే వినడానికి వింతగానే ఉంది కదూ.
హైదరాబాద్‌లో ఉపయోగించేవారు:
నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. హైదరాబాద్ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలో వీటిని ఉపయోగించేవారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే వారు. కిరోసిన్ రిఫ్రిజిరేటర్‌ను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ కారే 1858లో కనుగొన్నాడు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను ఈ లింక్ క్లిక్ చేసి మీరూ చూసేయండి.