ఈ ఫుడ్స్ తింటే.. మీకు ఏదురేలేదు..!
మన శరీరంలో రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటే.. కరోనా సోకినప్పటికీ దానిని సులభంగా జయించవ్చు. మరి.. రోగనిరోదక శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే.. కచ్చితంగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిందే.
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా ప్రపంచ దేశాలను చుట్టేయడం మొదలుపెట్టింది. కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనిని విరుగుడు కనిపెట్టాలని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు అవి సఫలం కాలేదు. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ మహమ్మారి మనదరి చేరకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.
మన శరీరంలో రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటే.. కరోనా సోకినప్పటికీ దానిని సులభంగా జయించవ్చు. మరి.. రోగనిరోదక శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే.. కచ్చితంగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఓసారి చూసేద్దామా..
1. పల్లీలు.. పల్లీలు, వేరు శెనగ గింజలు ఎలా పిలిచినా పర్లేదు. కానీ పప్రతిరోజూ వీటిని మీ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ మాత్రమే కాదు.. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు తినే ఆహారంలో, సలాడ్స్ లో వీటిని కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
2.కోడిగుడ్డు.. ప్రతిరోజూ మీ శరీరానికి కావాల్సిన జింక్ లో 5శాతం కోడిగుడ్డు ద్వారా లభిస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, సెలీనియం, విటమిన్ బి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
3.చిక్కుడు, పప్పు ధాన్యాలు.. పప్పు ధాన్యాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్స్, ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
4. పెరుగు.. మీ ఆహారంలో పెరుగుకి కూడా చోటు కల్పించాలి. మధ్యాహ్నం సమయంలో మీ భోజనం తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు తినడం మంచిది.
5.నట్స్.. జీడిపప్పు, బాదం పప్పు లాంటి నట్స్ కూడా రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలోని చెడు కొలిస్ట్రాల్ ని బయటకు వెళ్లగొట్టేందుకు సహాయం చేస్తుంది.