గ్యాస్, కడుపు ఉబ్బరం ఈ క్యాన్సర్ లక్షణాలా?
కడుపు ఉబ్బరం, గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి అజీర్థి లక్షణాలని చాలా మంది దీని గురించి పట్టించుకోరు. కానీ ఇవి అండాశయ క్యాన్సర్ లక్షణాలంటున్నారు నిపుణులు.

Ovarian Cancer
అండాశయ కేన్సర్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 అండాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ ఇతర క్యాన్సర్ల కంటే ఇదే ఎక్కువ మరణాలకు కారణమవుతోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అయితే స్మోకింగ్, ఇతర మాదకద్రవ్యాలు ఉపయోగించే మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలో నిర్ధారణ అయితే సుమారు 80 నుంచి 90% మంది మహిళలు దాని నుంచి కోలుకుంటారు.
ovarian cancer
అండాశయ క్యాన్సర్ అనేది అండాశయం కణాలలో ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్ అత్యంత సాధారణ రకం. అండాశయం ఉపరితలంపై "ఎపిథీలియల్" కణాలు ఏర్పడటం వల్ల ఇది వస్తుంది.. అంతేకాదు క్యాన్సర్లు గుడ్డు ఏర్పడే "జెర్మ్" కణాలు లేదా అండాశయం సహాయక కణజాలం నుంచి అభివృద్ధి చెందుతాయి.
ovarian cancer
ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం
ప్రతి ఏడాది మే 8న ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అండాశయ క్యాన్సర్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించడం , దానిపై వారికి అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. ఈ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం కొంచెం కష్టం. దీని లక్షణాలు చాలా సాధారణం. చాలా మంది ఈ క్యాన్సర్ లక్షణాలను జీర్ణ సమస్యలుగా భావిస్తారు.
ఈ సంవత్సరం ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం థీమ్ "మహిళలు వెనుకబడలేదు". అంటే ఈ విషయం తెలుసుకోవడంలో ఏ స్త్రీ కూడా వెనుకబడకూడదు.
ovarian cancer
సకాలంలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు
నిపుణుల ప్రకారం.. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళల్లో 80% మంది వీరిలో క్యాన్సర్ మూడో దశకు చేరుకున్నప్పుడు లేదా అంతకు మించి రోగం ముదిరినప్పుడు గుర్తించి చికిత్స తీసుకుంటారు. ఎందుకంటే ఈ సమస్యలో కనిపించే లక్షణాలు అచ్చం సాధారణ సమస్యలు లాగే ఉంటాయి. అందుకే దీని లక్షణాలను గుర్తించడం కొంచెం కష్టం.
గ్లోబోకాన్ 2018 ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. అండాశయ క్యాన్సర్ భారతీయ మహిళల్లో మూడో అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించిన డేటా ప్రకారం.. అండాశయ క్యాన్సర్ మొత్తం క్యాన్సర్లలో 3.44% ఉంది. అండాశయ క్యాన్సర్ మొదటి దశలో నిర్ధారణ అయిన వారు 94 సంవత్సరాల వరకు 5% మంది మహిళలు జీవిస్తారు. ఈ దశలో కేవలం 15% కేసులు మాత్రమే నిర్ధారణ అవుతాయి.
62 శాతం కేసులు మూడో లేదా నాలుగో దశలోనే గుర్తించబడతాయి. ఈ దశలో కేసులు గుర్తించినప్పుడు కేవలం 28% మంది మహిళలు మాత్రమే 5 సంవత్సరాలు బతుకుతారు. అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ovarian cancer
కడుపులో ఉబ్బరం లేదా ఎప్పుడూ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది
పొత్తికడుపు, తుంటి మధ్య ప్రాంతంలో నొప్పి
ఆకలి లేకపోవడం లేదా తక్కువ తిన్న తర్వాత ఎక్కువ కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
తరచుగా మూత్ర విసర్జన
పుల్లని వాసన
మలబద్ధకం లేదా విరేచనాలు
వీపులో ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది
అకస్మాత్తుగా బరువు తగ్గడం
సెక్స్ సమయంలో ఎక్కువ నొప్పి కలుగుతుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పీరియడ్ ప్రవాహంలో మార్పులు
జ్వరం
పెరుగుతున్న వయస్సు
అండాశయ క్యాన్సర్ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా అండాశయ క్యాన్సర్ కేసులు 50 ఏళ్లు పైబడిన మహిళల్లో కనిపిస్తాయి.
జన్యు మార్పులు
అండాశయ క్యాన్సర్ కు జన్యు మార్పులు కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. దీనికి తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు కూడా కారణం కావొచ్చు. బీఆర్సిఎ 1 , బిఆర్సిఎ 2 జన్యువులు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ జన్యువులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
Ovarian cancer
కుటుంబ చరిత్ర
మీ కుటుంబంలో అండాశయ క్యాన్సర్ తో బాధపడేవారు ఉంటే.. మీకు ఇతరుల మహిళల కంటే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది.
బరువు పెరగడం
అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం.
రుతువిరతి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ
రుతువిరతి సంకేతాలు, లక్షణాలను నియంత్రించడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
గర్భవతి కాకపోవడం
మీరు ఎప్పుడూ గర్భవతి కాకపోతే.. మీకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.