చలికాలంలోనే గుండెపోటు ఎందుకు ఎక్కువొస్తుంది? ఈ సీజన్ లో గుండెను ఎలా రక్షించుకోవాలంటే?
చలికాలం వచ్చిందంటే చాలు గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే ఈ సీజన్ లో మన ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ సీజన్ లోనే గుండెపోటు, గుండె జబ్బులు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వాటిని తగ్గించడానికి ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రావడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనివల్లే లేనిపోని అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు అంటుకుంటాయి. అంతేకాదు ఈ సీజన్ లో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అందుకే చలికాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ చలికాలంలో హృద్రోగులు మాత్రం తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
heart attack
ఎందుకంటే ఈ సీజన్ లో హార్ట్ ఎటాక్ రిస్క్ బాగా పెరుగుతుంది. నిజానికి చలికాలంలో మన జీవనశైలి ఎక్కువగా మారుతుంది. చలి కారణంగా చాలా మంది ఈ సీజన్ లో వ్యాయామం చేయరు. ఎక్కువగా నడవరు. అంటే శారీరక శ్రమను బాగా తగ్గించేస్తారన్న మాట. ఇదే గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. మీ ఇంట్లో ఎవరైన హార్ట్ పేషెంట్ అయితే ఈ సీజన్ లో వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.
చలికాలంలో గుండెపోటు ఎందుకు వస్తుంది?
చలికాలం వచ్చిందంటే గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుంటాయి. కానీ చలికాలంలోనే గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి చలికాలంలో చలి కారణంగా మీ రక్త నాళాలు కుంచించుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అవును దీనివల్ల మీ రక్తపోటు బాగా పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. మీ హృదయ స్పందన రేటు రక్తపోటును అమాంతం పెంచుతుంది. ఇదే గుండె జబ్బులకు ప్రధాన కారకమంటున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితిలో మీ గుండెను గుండె జబ్బుల నుంచి ఎలా రక్షించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన ఆహారం
ఈ సీజన్ లో మీకు గుండెపోటు, గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు మీ రోజువారి ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చాలి. చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచడం కోసం పండ్లు, కూరగాయలు, కాయలు, పౌల్ట్రీ, తృణధాన్యాలు వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్కువ చక్కెర, సోడియం, ట్రాన్స్ ఫ్యాట్ ఆహారాలకు దూరంగా ఉండాలి.
హైడ్రేటెడ్ గా ఉండండి
చలికాలంలో అస్సలు దాహంగా అనిపించదు. దీనివల్లే చాలా మంది నీళ్లను అసలే తాగరు. కేవలం తిన్నప్పుడు మాత్రమే తాగుతుంటారు. కానీ దీనివల్ల మీ శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ సీజన్ లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. హైడ్రేట్ గా ఉంటేనే మీ శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గించండి
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతున్నారు. కానీ పేలవమైన మానసిక ఆరోగ్యం లేదా ఒత్తిడి మన గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే నిపుణుడి సహాయంతో ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి.
వెచ్చని దుస్తులు
చలికాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చలి నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం సరైన ఆహారంతో పాటుగా సరైన దుస్తులు కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి వెచ్చని, మెత్తటి లేయర్డ్ దుస్తులను ధరించండి.
వ్యాయామం చేయండి
చలికాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడాలంటే వ్యాయామాన్ని తప్పకుండా చేయాల్సిందే. కానీ బయట చల్లని వాతావరణంలో వ్యాయామం చేయొద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ గుండెపై చెడు ప్రభావం ప డుతుంది. అందుకే ఇంట్లోనే వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.