ఎండాకాలంలో మూత్రం మంట ఎందుకొస్తుంది?
ఎండాకాలంలో లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో మూత్రంలో మంట ఒకటి. అసలు ఎండాకాలంలో మూత్రంలో మంట ఎందుకొస్తుందంటే?
urine
ఎండాకాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వీటిలో ఒకటి మూత్రంలో మంట. నిజానికి మూత్రంలో మంట ఎండాకాలంలోనే ఎక్కువగా వస్తుంటుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, మంట వస్తుంటుంది. దీన్ని భరించడం చాలా కష్టమే. అసలు మూత్రంలో మంట, చిరాకుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మూత్రంలో మంట
ఎండాకాలంలో చాలా సార్లు మూత్ర విసర్జన చేసేటప్పుడు మండుతున్న అనుభూతి కలుగుతుంది. వైద్య భాషలో దీనిని డైసూరియా అంటారు. ఈ పరిస్థితి కొన్ని కొన్నిసార్లు మూత్ర మార్గంలో చికాకు కలిగిస్తుంది.
నీటి కొరత
ఎండాకాలంలో మూత్రంలో మంట రావడానికి ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడమేనంటారు ఆరోగ్య నిపుణులు. నిర్జలీకరణం కారణంగా మూత్రం తక్కువగా వస్తుంది. అలాగే ఇది మంట కలుగుతుంది.
యూటీఐ
మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. ఎండాకాలంలో మూత్రంలో చికాకు మూత్రాశయంలో బ్యాక్టీరియా సంఖ్య పెరగడం వల్ల వస్తుంది. దీన్నే యూటీఐ అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారికే వస్తుంది.
స్పైసీ ఫుడ్స్
ఎండాకాలంలో మూత్రంలో మంటరావడానికి స్పైసీ ఫుడ్ కూడా ఒక ప్రధాన కారణమే కావొచ్చంటున్నారు నిపుణులు. చాలా మంది ఎండాకాలంలో కూడా ఆయిల్, స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల మూత్రంలో మంట వస్తుంది. అందుకే ఈ సీజన్ లో స్పైసీ ఫుడ్ ను తినకూడదు.
లైంగిక సంక్రమణ అంటువ్యాధులు
క్లామిడియా, గోనేరియా, హెర్పెస్ వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు కూడా మూత్రంలో చికాకు, మంట, నొప్పిని కలిగిస్తాయి. ఇది ప్రైవేట్ భాగం చుట్టూ దద్దుర్లు లేదా బొబ్బల లాగా కూడా కనిపిస్తుంది.
కిడ్నీ స్టోన్
మూత్రపిండాల్లో రాయి ఉన్నవారికి కూడా ఈ సమస్య వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన సమయంలో మంట కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు తప్పనిసరిగా హాస్పటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోవాలి.
మూత్ర మంటను ఎలా తగ్గించాలి?
వేసవిలో మూత్రంలో మంట తగ్గాలంటే కీరదోసకాయ, పెరుగు, కొబ్బరినీళ్లు, అల్లం వంటివి మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మిమ్మల్ని చల్లబరుస్తాయి. మూత్రంలో మంట రాకుండా చేస్తాయి.