MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టీ, కాఫీ.. రెండింటిలో ఏది తాగితే మంచిది?

టీ, కాఫీ.. రెండింటిలో ఏది తాగితే మంచిది?

కొంతమంది టీ ని ఇష్టపడితే.. మరికొంతమంది కాఫీని తాగడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే మంచిదో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 27 2025, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Getty Images

Image: Getty Images

కాలాలతో సంబంధం లేకుండా టీ, కాఫీలను తాగుతుంటారు. అయితే కొంతమంది టీ తాగితే, మరికొంతమంది కాఫీని తాగుతుంటారు. ఏదేమైనా ఈ రెండూ చలికాలంలో వేడి వేడిగా, బలే టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండింటిని చాలా మంది ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా మన ఇండియాలో టీ, కాఫీలకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది టీ లేదా కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. వీటితోనే డేను ముగిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే చాలా మందికి టీ, కాఫీ రెండింలో ఏది మంచిది అని డౌట్ వస్తుంటుంది. కొంతమంది టీ అంటే, మరికొంతమంది కాదు కాఫీ అని చెప్తుంటారు. టీ తాగేవారు టీ మంచిదని చెప్తే.. కాఫీ తాగేవారు కాఫీ మంచిదని చెప్తుంటారు. కానీ నిపుణులు టీ, కాఫీలో ఏది మంచిదంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

టీ, కాఫీ ప్రయోజనాలు

టీ, కాఫీ రెండూ మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రెండింటిలో మంచి మొత్తంలో యాంటీ  ఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ తాగడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే మానసికంగా చురుగ్గా కూడా ఉంటాం. టీలో ఎల్-థియనిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒత్తిడిని వెంటనే తగ్గించి మనసును ప్రశాంతంగా మార్చేస్తుంది. విశ్రాంతినిస్తుంది.ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

45


ఒకపోతే కాఫీలో కూడా కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తాగినా మీ శరీరానికి వెంటనే ఎనర్జీ అందుతుంది. అలాగే దీనివల్ల మీరు శారీరక శ్రమను పెంచుతారు. పలు పరిశోధనల ప్రకారం.. కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. 

టీ, కాఫీలో ఏది మంచిది? 

కెఫిన్ సున్నితత్వం: కొంతమందికి టీ, కాఫీలో ఉండే కెఫిన్ కు సున్నితత్వం ఉంటుంది. ఇలాంటి వారు కెఫిన్ ను తక్కువగా తీసుకోవాలి. కాబట్టి వీరికి టీ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

55


ఆరోగ్య ప్రభావాలు: టీ లేదా కాఫీలను తాగే అంశాలు ఈ రెండింటిలో ఏది మంచిదో నిర్ణయిస్తాయి. అంటే మీరు మీ ఎనర్జీ లెవెల్స్ ను పెంచుకోవాలనుకుంటే కాఫీ బెస్ట్ ఆప్షన్. కానీ టీ విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మంచిదని నిపుణులు అంటున్నారు. 

మొత్తం మ్మీద లిమిట్ లో తాగితేనే టీ అయినా కాఫీ అయినా మీకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే మీరు మీ ఆరోగ్యం, మీ టేస్ట్ ను బట్టి టీ, కాఫీలో దేనినైనా తాగొచ్చు. అయినప్పటికీ కెఫిన్ ను తీసుకునే ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతకైనా మంచిది. 
 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image3
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved