అసలు చెమట ఎక్కువగా ఎందుకు పడుతుందో తెలుసా?
చెమట అనేది మన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడే ఒక సహజ ప్రక్రియ. అయితే కొంతమందికి సాధారణం కంటే విపరీతంగా చెమటలు పడుతుంటాయి. దీనిని హైపర్ హైడ్రోసిస్ అంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
చెమట అనేది ఒక సాధారణ, సహజ శారీరక ప్రక్రియ. ఇది మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఎంతో అవసరం. చెమట వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమందికి మాత్రం సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. దీనివల్ల అసౌకర్యం కలుగుతుంది. ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. చెమట మరీ ఎక్కువగా పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. అసలు ఇలా చెమట ఎక్కువగా ఎందుకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హైపర్ హైడ్రోసిస్ రకాలు
1. ప్రాధమిక హైపర్ హైడ్రోసిస్: ప్రాథమిక హైపర్ హైడ్రోసిస్ కు స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదు. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టడానికి ఒత్తిడి కారణం. ఇది ఒత్తిడి ద్వారా ప్రేరేపించబడుతుంది. అలాగే ఇది ఎక్కువగా పగటిపూట మాత్రమే వస్తుంది.
Sweating
2. సెకండరీ హైపర్ హైడ్రోసిస్: దీనిలో మన శరీరమంతా చెమట పట్టడం ప్రారంభమవుతుంది. అలాగే ఇది రుతువిరతి, క్యాన్సర్, వెన్నెముక గాయం వంటి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎక్కువగా వస్తుంది. అలాగే కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఇలా చెమటలు ఎక్కువగా పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా చంకలు, చేతులు, కాళ్లలో ఎక్కువ చెమటను కలిగిస్తుంది.
హైపర్ హైడ్రోసిస్ తో ఎలా వ్యవహరించాలి?
యాంటిపెర్స్పిరెంట్: యాంటీ సెర్స్పిరెంట్ ను రెగ్యులర్ గా వాడితే చెమట తక్కువగా పడుతుంది. ఇది చెమట గ్రంథులను నిరోధిస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు దీన్ని అప్లై చేయడం మంచిది. దీంతో చెమటలో యాంటీపెర్స్పిరెంట్ ప్రవహించదు.
ఆహారంలో మార్పులు: కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది. స్పైసీ ఫుడ్, కెఫిన్, ఆల్కహాల్ వంటి కొన్ని ఆహార పదార్థాలు చెమట గ్రంథులను ప్రేరేపిస్తాయి. దీనితో చెమట విపరీతంగా పడుతుంది. చెమట మరీ ఇంతలా పట్టకూడదంటే మాత్రం మీ ఆహారపు అలవట్లను మార్చుకోండి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. మీరు నీళ్లను ఎక్కువగా తాగాలి. పండ్లను, కూరగాయలను తినండి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
sweating
సమయోచిత వైప్స్: అండర్ ఆర్మ్ లో అప్లై చేయడానికి వైప్స్ కూడా మార్కెట్ లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించి హైపర్ హైడ్రోసిస్ సమస్యను తగ్గించుకోవచ్చు.