MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • ఈ లక్షణాలుంటే మీకు ఓసీడీ ఉన్నట్టే.. తప్పకుండా హాస్పటల్ కు వెళ్లండి

ఈ లక్షణాలుంటే మీకు ఓసీడీ ఉన్నట్టే.. తప్పకుండా హాస్పటల్ కు వెళ్లండి

ఓసీడీ అనేది ఒక మానసిక సమస్య. దీనివల్ల ఒక వ్యక్తి తనకు నియంత్రణ లేని ఆలోచనలను కలిగి ఉంటాడు. ఈ వ్యాధి వల్ల ఒక్క బాధితుడే కాదు కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 22 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Getty

Image: Getty

ఓసీడీ ఒక వ్యాధి. ఈ సమస్య వల్ల బాధితుడు నియంత్రణ లేని ఆందోళనకు పదేపదే గురవుతుంటాడు. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు నిలకడగా ఉండలేకపోతుంటారు. ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ఈ వ్యాధికున్న అత్యంత సాధారణ లక్షణం. అంతదాకా ఎందుకే  శర్వానంద్ ‘మహానుబావుడు’ సినిమా చూసే ఉంటారుగా.. సేమ్ అందులో శర్వానంద్ క్యారెక్టర్ లా చేస్తారన్న మాట. అంటే పదేపదే చేతులు కడుక్కోవడం, ఇంట్లో అన్ని సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడం వంటివి ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారి అలవాట్లు ఇంట్లో వారితో పాటుగా కొన్నిసార్లు చుట్టుపక్కల వారిని కూడా ఇబ్బంది పెడుతాయి. ఈ వ్యాధి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Getty

Image: Getty

ఓసీడీ కారణాలు

సెరోటోనిన్ ఒక శక్తివంతమైన న్యూరోట్రాన్స్మిటర్. ఇది మన శరీరంలోని ఎన్నో విధులకు అవసరం. అయితే ఇది అసమతుల్యంగా మారడం వల్ల ఓసీడీ సమస్య ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఇది జన్యుపరమైనది కూడా కావొచ్చు. మెదడు నిర్మాణం, జన్యువులు, ఒత్తిడి ఓసిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 
 

35
Image: Getty

Image: Getty

ఓసీడీ లక్షణాలు

- తరచుగా చేతులు కడుక్కోవడం. అవతలివారిని ముట్టుకోకపోవడం. ఇంటిని, మనుషులను శుభ్రంగా లేరని అనడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పేషెంట్లు ఎప్పుడూ చేతులను కడుగుతూనే ఉంటారు. ఇది ఓసీడీ అత్యంత సాధారణ లక్షణం.

- దీనివల్ల ఎవరికైనా, ఎప్పుడైనా చెడు జరగొచ్చని లేదా, ప్రమాదం జరగొచ్చని తరచూ భయపడుతూ ఉంటారు. 

- గ్యాస్ ఆఫ్  చేశారా? లేదా?  ఫ్యాన్ లేదా లైట్స్ పనిచేస్తున్నాయా? లేదా వంటివి ఎప్పుడూ చెక్ చేస్తుంటారు. 

45
Image: Getty

Image: Getty

ఇంటి సామాన్లు చక్కగా ఉండాలంటారు. ఇంట్లో కొంచెం కూడా చెత్త ఉండనీయరు. ఏదీ ఏ ప్లేస్ లో ఉండాలో అక్కడే ఉండాలంటారు.

- ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. 

- మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలను కనిపిస్తే వారు ఓసిడితో బాధపడుతున్నట్టే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఓసీడీ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు. 
 

55
ocd

ocd

ఓసీడీకి చికిత్స

- ఓసీడీ పేషెంట్లకు సైకోథెరపీతో పాటు మందులు కూడా ఇస్తారు. మరీ ముఖ్యంగా వారికి కౌన్సిలింగ్ ను ఇస్తారు. కానీ డాక్టర్ సలహా లేకుండా మీరు ఏ మందులను వాడొద్దు. ఆపొద్దు. 

- ఈ సమస్యను తగ్గించుకోవడానికి మెదడును పనిలో నిమగ్నం చేయడం అవసరం. దీని కోసం పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, వాకింగ్ కు వెళ్లడం వంటివి చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన చికిత్స. కానీ ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved