రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయకపోతే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తారు. కొంతమంది మాత్రమే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రి పూట బ్రష్ చేస్తుంటారు. ఇలా రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే ఏమౌతుంది? చేయకపోతే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.
మన నోటిని, నాలుకను బట్టే ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు డాక్టర్లు. అందుకే హాస్పటల్ కు వెళ్లినప్పుడు నోరు చూపించమని డాక్టర్లు అంటుంటారు. మీకు తెలుసా? మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని తొలగించకపోతే నోట్లో నుంచి దుర్వాసన రావడంతో పాటుగా ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అందుకే రోజూ బ్రష్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం మంచి అలవాటని చెప్తారు. అసలు రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
brushing teeth
కావిటీస్ నివారణ
రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు. అలాగే పళ్లలో ఇరుకున్న ఆహార కణాలు కూడా తొలగిపోతాయి. ఫలకంలో ఉండే బ్యాక్టీరియా దంతాల ఎనామెల్ ను నాశనం చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది దంతక్షయానికి కారణమవుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే ఈ సమస్యలేవీ రావు.
brushing
చిగుళ్ల వ్యాధి నివారణ
మనం బ్రష్ సరిగ్గా చేయకుంటే చిగుళ్ల వ్యాధి వస్తుంది. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఒకవేళ మీకు చిగుళ్ల వ్యాధి వస్తే.. దాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే పంటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్
ప్రస్తుత కాలంలో చాలా మంది మనం రెగ్యులర్ గా వాడే టూత్ బ్రష్ లకు బదులుగా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లనే వాడుతున్నారు. మనం వాడే మాన్యువల్ టూత్ బ్రష్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లే మంచివని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి మన నోటిని బాగా శుభప్రరుస్తాయి. అలాగే ఇవి సౌకర్యవంతంగా కూడా ఉంటాయి.
రొటీన్ దంత పరీక్షలు
రోజుకు రెండు పూటలా బ్రష్ చేయడం వల్ల దంత సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీనితో పాటుగా అప్పుడప్పుడు దంత పరీక్షలు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలంటారు నిపుణులు. దీనివల్ల ఏదైనా సమస్యను ముందుగానే గుర్తించొచ్చు.
Brushing
దంతాల నష్టాన్ని నివారిస్తుంది
సరిగ్గా పళ్లు తోముకోవడం వల్ల దంతాల ఫలకం, బ్యాక్టీరియా తొలగిపోతాయి. దీంతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీంతో దంత నష్టం జరిగే అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రతి రోజూ రెండు సార్లు పళ్లు తోముకోండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది.