కర్పూరాన్ని ఒంటిరి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
దేవుడికి పూజ చేసే సమయంలో కర్పూరాన్ని వెళిగిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్పూరంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది.
camphor
హిందూ మతంలో.. పూజా సమయంలో కర్పూరాన్ని కాల్చడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల మన శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న ముచ్చల చాలా మందికి తెలియదు. నిజానికి కర్పూరంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని శరీరానికి రాసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని ఒంటికి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Camphor health benefits
కర్పూరం లక్షణాలు
కర్పూరంలో డీకాంగెస్టెంట్, లినాలూల్, పినేన్ బి-పినేన్, లిమోనెన్, సెబినెన్, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటుంది.
ఉపయోగాలు
కర్పూరంలో ఉండే ఔషద గుణాలు శరీరానికి సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది ప్రతి సమస్యకు భిన్నంగా ఉపయోగించబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
కర్పూరం కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కర్పూరాన్ని నీటిలో బాగా మిక్స్ చేసి కీళ్లపై అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దురద ఉపశమనం
శరీరంలో ఏ భాగంలోనైనా దురద సమస్య ఉంటే కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం వేసి బాగా కలపండి. దురద ఉన్న చోట దీన్ని అప్లై చేయండి. ఇది దురదను వెంటనే తగ్గిస్తుంది.
చుండ్రు ఉపశమనం
నెత్తిమీద చుండ్రు ఉంటే జుట్టు విపరీతంగా రాలుతుంది. అయితే కర్పూరం ఈ చుండ్రును తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొబ్బరినూనెలో కర్పూరం కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
గాయాలు నయం
కర్పూరంతో గాయలను కూడా నయం చేసుకోవచ్చు. ఇందుకోసం కర్పూరాన్ని నీటితో కలిపి గాయంపై లేదా గాయంచుట్టూ పూయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గాయం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది.
శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం
కర్పూరంలో ఉండే డీకోంగెస్టివ్ లక్షణాలు గొంతు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే దీని వాడకం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే కర్పూరాన్ని శరీరానికి అప్లై చేసే ముందు డాక్టర్ లేదా ఎక్స్ పర్ట్ సలహా తీసుకోవాలి.