బ్రష్ చేయకపోతే ఏమౌతుందో తెలుసా?
రోజూ ఖచ్చితంగా పళ్లను తోమాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అసలు పళ్లను మొత్తమే తోమకున్నా.. వారంలో కొన్ని రోజులే బ్రష్ చేసినా ఏమౌతుందన్న ముచ్చటను ఎప్పుడన్నా తెలుసుకున్నారా?
మనలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ పళ్లను ఖచ్చితంగా తోముతారు. నిజానికి రోజూ బ్రష్ చేసుకునే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఇది లేకపోతే ఇక మీ ఆరోగ్యం ఏమౌతుందో చెప్పడం చాలా కష్టమంటారు నిపుణులు. మీకు తెలుసా? మన నోట్లో సుమారుగా 300 రకాల బ్యాక్టీరియా నివసిస్తుందట. బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మన మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
brush
మన నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుందన్న ముచ్చట అందరికీ తెలుసు. అయితే ఇది ఎక్కువగా హానికరం కాదు. రోజువారీ బ్రషింగ్ ప్రోటోకాల్ బ్యాక్టీరియా స్థాయిని సరైన స్థాయిలో ఉంచుతుంది. కానీ బ్రష్ సరిగ్గా చేయకపోతేనే ఈ బ్యాక్టీరియా స్థాయిలు పెరుగుతాయి. దీంతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు వస్తాయి. నోటి ఆరోగ్యం మన జీర్ణ, శ్వాసనాళంతో దాని ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీకు తెలుసా? మన నోట్లో అనారోగ్యకరమైన బ్యాక్టీరియా స్థాయిలు పెరగడం వల్ల అనేక గుండె జబ్బులు వస్తాయి. అలాగే ఉదర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పళ్లు తోముకోకపోతే వచ్చే నష్టమేమీ లేదని కొంతమంది భావిస్తారు. కానీ మీరు కొన్నే కొన్ని రోజులు పళ్లు తోముకోవడాన్ని స్కిప్ చేస్తే ఫలకం.. టార్టార్ అని పిలువబడే గట్టి నిక్షేపాలుగా మారడానికి కేవలం 48 గంటలు పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పంటి ఉపరితలంపై టార్టార్ నిక్షేపాలు ఏర్పడిన తర్వాత.. వాటిని బ్రష్ తో తొలగించడం కష్టమవుతుంది. ఫలితంగా దంతాల ఉపరితలంపై ఎక్కువ నిక్షేపాలు పేరుకుపోతాయి. ఈ నిక్షేపాలు దంతాల నిర్మాణాన్ని బలహీనపరచడం ప్రారంభిస్తాయి. అలాగే నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. అలాగే అవి ఇతర చిగుళ్ల వ్యాధులకు కూడా కారణమవుతాయి.
బ్రష్ చేయకపోతే ఏమౌతుంది?
చిత్తవైకల్యం
కరెంట్ న్యూరాలజీ అండ్ న్యూరోసైన్స్ రిపోర్ట్స్ లో ప్రచురించబడిన ఒక పరిశోధన సమీక్ష ప్రకారం.. అనారోగ్యకరమైన నోరు శరీరంలో మంటకు దారితీస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే ఇది మెదడు వాపు, మెదడు కణాల నష్టానికి దారితీస్తుంది. ఇది చిత్తవైకల్యానికి దారితీస్తుంది.
గుండె సమస్యలు
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడుసార్లు పళ్లు తోముకునేవారికి కర్ణిక ఫైబ్రిలేషన్, గుండె ఆగిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
గట్ సమస్యలు
మీ నోరు 300 రకాల మంచి, చెడు బ్యాక్టీరియాతో నిండినప్పుడు గట్ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీ గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ఒకే ఒక బ్యాక్టీరియా సరిపోతుంది. కాబట్టి మూడుసార్లు కాకపోతే, రోజుకు కనీసం రెండుసార్లైనా మీ పళ్లను తోమండి.
అలాగే ఫ్లోసింగ్, భోజనం తర్వాత గార్గ్లింగ్ చేయడం, ఫైబర్ కంటెంట్ ఉండే పండ్లు, కూరగాయలు తినడం కూడా మంచిదే. ఇది మీ నోటి పరిశుభ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే బ్రష్ చేయకుండా ఉండకండి. రోజుకు రెండు, మూడు నిమిషాల టైంలోనే మీరు మీ పళ్లను క్లీన్ చేసుకోగలుగుతారు. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.