ఒక్క నెలలో 5 కిలోల బరువు తగ్గడమెలా?
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలని చాలా మంది అనుకుంటూఉంటారు. కానీ ఆకలితో ఉండటం వల్ల మీరు బరువు తగ్గుతారనేది మీ అపోహ మాత్రమే. ఎక్కువగా ఉన్న బరువును తగ్గాలంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తినడంతో పాటుగా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి. అవేంటంటే?
బరువు పెరగడం ఎంత సులభమో.. దాన్ని తగ్గించుకోవడం అంత కష్టం. శరీరంలో పేరుకుపోయిన మొండి శరీర కొవ్వు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఎన్నో రోగాలు వచ్చేలా చేయడంతో పాటుగా మీ అందాన్ని కూడా పాడుచేస్తుంది. బరువు ఖచ్చితంగా తగ్గాలి. దాని కోసం ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. కానీ ఒకటి రెండు రోజుల్లోనే వాటిని మర్చిపోతుంటారు. బరువు తగ్గాలంటే మీరు హెల్తీ ఫుడ్ ను తినాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకూడదు. ఒక్క నెల రోజుల్లో 5 కిలోల బరువు తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెరుగు
మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే సీజన్లతో సంబంధం లేకుండా పెరుగు లేదా మజ్జిగను భోజనంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రోబయోటిక్స్ కు మంచి మూలం. ఇది మన గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో నల్ల ఉప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, పుదీనా కలిపి తాగితే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీనివల్ల మీకు జలుబు చేయదు. అలాగే దీనివల్ల మీ శరీరంలో విటమిన్ బి12 పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణశక్తిని బట్టి ఆహారం
మీకు జీర్ణమయ్యేంత ఆహారాన్ని మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే లేదా ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టమైతే మీరు ఇంకా తినాల్సిన అవసరం లేదు. మీరు శారీరక శ్రమ తక్కువగా చేస్తే హెవీగా తినడం మానుకోండి. కూర్చొని వర్క్ చేసేవాళ్లు తక్కువ మొత్తంలోనే తినాలి. లేదంటే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది.
చిరుధాన్యాలు
ప్రస్తుత కాలంలో చాలా మంది గోధుమ పిండితో చేసిన చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. కానీ బరువు తగ్గాలనుకుంటున్నవాళ్లు ఈ పిండికి బదులుగా మొక్కజొన్న, చిరుధాన్యాలు, ఇతర చిరుధాన్యాలతో చేసిన రొట్టెలను తినాలి. ఇవి మీరు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. రాగులు, శనగపిండి, చిరుధాన్యాలతో పాటుగా ఇతర ధాన్యాలు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.