MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున పచ్చి వెల్లుల్లిని తింటే బరువు తగ్గుతరా..?

పరిగడుపున పచ్చి వెల్లుల్లిని తింటే బరువు తగ్గుతరా..?

వెల్లుల్లితో బోలెడు లాభాలు ఉన్నాయి. ఎన్నో అధ్యయనాలు రోజూ వెల్లుల్లిని తినడం గుండెకు మంచిదని చెబుతున్నాయి. నిజానికి వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 25 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వెల్లుల్లి లేని కూర అసలే ఉండదు. ప్రతి వంటింట్లో ఈ మసాలా దినుసు ఖచ్చితంగా ఉంటుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిని తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది జీర్ణ సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే వీటిని మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలంటరు ఆరోగ్య నిపుణులు. కడుపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి పచ్చి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది.

34

రోజూ వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.  ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వెల్లుల్లి తుమ్ములు, జలుబు, దగ్గు లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం మంచిది.  వెల్లుల్లి శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ ఇందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిని తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

44

వెల్లుల్లి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి మన శరీరానికి అవసరం లేని కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలోని మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved