జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..!
తీరిక లేని పనుల వల్ల జిమ్ కు వెళ్లే సమయముండదు చాలా మందికి. ఇలాంటి వారు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు. అదెలాగంటే?
బిజీ లైఫ్ స్టైల్ లో ఫిట్నెస్ కోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా కష్టమే. కానీ కొంతమంది ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ కోసం రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంటారు. అయితే ఆఫీసుకు వెళ్లే వారికి ఉదయం జిమ్ కు వెళ్లే టైం అసలే ఉండదు. దీనివల్లే మహిళల శరీరంలోని ఎన్నో భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి వారు జిమ్ కు వెళ్లకున్నా కొవ్వును తగ్గించే చిట్కాలు కూడా ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చాలు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సమతుల్య ఆహారం
మొండి కొవ్వును తగ్గించడానికి సమతుల్య ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా వేయించిన, కారంగా ఉండే ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్ శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది. సమతుల్య ఆహారంలో లీన్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి స్నాక్స్, ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులను చేర్చకూడదు.
weight loss
ఫైబర్
కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు తమ ఆహారంలో ఫైబర్ ను పెంచాలి. ఎందుకంటే ఈ ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. మీ ఆహారంలో ఫైబర్ ను ఎక్కువగా చేర్చడం వల్ల బరువు తగ్గుతారు. ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల మీకు ఎక్కువసేపు ఆకలి అనిపించదు. దీంతో మీరు అతిగా తినలేరు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, విత్తనాలు, చిక్కుళ్లలో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
Weight Loss
ప్రోటీన్
కొవ్వును తగ్గించడానికి మీరు తేలికపాటి వ్యాయామం చేయడంతో పాటుగా ప్రోటీన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కోరికలను, ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే శరీరం నుంచి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఎక్కువున్న ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుందని ఒక అధ్యయనం కనుగొంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలిని పెంచే హార్మోన్ గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయి.
Weight Loss
తగినంత నీరు
మొండి కొవ్వును కరిగించుకోవడానికి మీకు క్రమం తప్పకుండా నీటిని పుష్కలంగా తాగాలి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ ఉంచుకోవాలి. తినడానికి అర్థగంట ముందు నీటిని తాగితే తక్కువగా తింటారు. వాటర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. ఇది మీరు తీసుకునే కేలరీల సంఖ్యను కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. హైడ్రేటెడ్ గా ఉండటానికి శీతల పానీయాలు, రెడీమేడ్ జ్యూస్ లను తాగకూడదు. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి కేలరీల తీసుకోవడాన్ని తగ్గించడానికి బదులుగా పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా మీరు టీ లేదా చక్కెర లేని పానీయాలనే తాగాలి.
Weight Loss
భోజనం సమయం
బరువు పెరగడానికి, కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రాత్రిపూట ఆలస్యంగా తినడం కూడా ఉంది. చాలా మంది బిజీగా ఉండటం వల్ల రాత్రి ఎనిమిది, తొమ్మిది లేదా కొన్నిసార్లు పది గంటల తర్వాత భోజనం చేస్తారు. దీనివల్ల ఫుడ్ జీర్ణం కావడానికి తగినంత సమయం ఉండదు. ఫలితంగా ఈ ఆహారం నుంచి శరీరానికి పోషణను అందించడానికి బదులుగా ఇది కొవ్వు రూపంలో శరీరంలో అక్కడక్కడ పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు కొవ్వును కరిగించాలనుకుంటే రాత్రి భోజనం సమయాన్ని నిర్ణయించుకోండి. ముఖ్యంగా మీరు నిద్రపోవడానికి రెండు గంటల ముందే తినేలా టైం ను సెట్ చేసుకోండి.