గుడ్డు, పనీర్.. రెండింటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
గుడ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతుంది. మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. గుడ్లతో పాటుగా పనీర్ కూడా మంచి పోషకాహారం. మరి బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?
పనీర్, గుడ్లు మంచి ప్రోటీన్ వనరులు. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. పనీర్, గుడ్లు రెండింటినీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు విరివిగా ఉపయోగిస్తారు. పనీర్ తేలికపాటి, క్రీమీ రుచిని కలిగుంటుంది. గుడ్లు తేలికపాటి ఉప్పగా ఉంటాయి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అయితే శాకాహారులకు పనీర్ మాత్రమే మంచి ప్రోటీన్ వనరు. కానీ మాంసాహారులకు ప్రోటీన్ వనరులు చాలానే ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి సహాయపడుతుందో తెలుసా?
paneer
మనలో చాలా మంది ప్రోటీన్ కోసం పనీర్, గుడ్లను తింటుంటారు. నిజానికి ఈ రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. వ్యాయామానికి ముందు, తర్వాత లేదా భోజనంలో వీటిని తింటుంటారు. శాకాహారులు ప్రోటీన్లు పొందడానికి పనీర్ ను, మాంసాహారులు గుడ్లు, చికెన్ ను తింటారు.
ఉడికించిన గుడ్డులోని పోషకాలు
ప్రోటీన్: 5.5 గ్రా.
మొత్తం కొవ్వు: 4.2 గ్రాములు
కాల్షియం: 24.6 మి.గ్రా
ఐరన్: 0.8 మి.గ్రా
మెగ్నీషియం: 5.3 మి.గ్రా
ఫాస్ఫరస్: 86.7 మి.గ్రా.
పొటాషియం: 60.3 మి.గ్రా
జింక్: 0.6 మి.గ్రా
కొలెస్ట్రాల్: 162 మి.గ్రా
సెలీనియం: 13.4 మైక్రోగ్రాములు (ఎంసిజి)
paneer
40 గ్రాముల తక్కువ కొవ్వు కలిగిన పనీర్ లోని పోషకాలు
ప్రోటీన్: 7.54 గ్రా.
కొవ్వు: 5.88 గ్రాములు
పిండి పదార్థాలు: 4.96 గ్రా.
ఫోలేట్స్: 37.32 మైక్రోగ్రామ్
కాల్షియం: 190.4 మి.గ్రా
ఫాస్ఫరస్: 132 మి.గ్రా.
పొటాషియం: 50 మి.గ్రా.
ఇకపోతే గుడ్లు చవకైనవి. దీనిలో మన శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మొత్తం గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ తో పాటుగా శరీర సాధారణ పనితీరుకు అవసరమైన ఎన్నో ఇతర పోషకాలు ఉంటాయి. గుడ్లను ఎన్నో విధాలుగా తినొచ్చు. స్క్రాంబ్లింగ్ గుడ్లు, గుడ్డు కూర, ఉడికించిన గుడ్లు, వేయించిన గుడ్లు, ఆమ్లేట్ అంటూ ఎన్నో విధాలుగా తినొచ్చు. అయితే ఫ్యాట్ వల్ల చాలా మంది గుడ్డులోని పచ్చసొనను అస్సలు తినరు. కానీ పచ్చసొనలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
పనీర్ లేదా కాటేజ్ చీజ్ విషయానికొస్తే.. భారతదేశంలో ఇది ప్రసిద్ధ పాల ఉత్పత్తి. దీనిలో క్యాల్షియం, విటమిన్ బి 12, సెలీనియం, విటమిన్ డి, రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పనీర్ ను సలాడ్ లో చేర్చొచ్చు. పనీర్ కూరను కూడా చేసుకుని తినొచ్చు. లేదా ఏదైనా కూరగాయలతో పాటుగా వండొచ్చు. పాలవిరుగుడు నుంచి పెరుగును వేరు చేయడం ద్వారా పాల నుంచి కాటేజ్ చీజ్ ను తయారు చేస్తారు.
గుడ్లు ప్రోటీన్ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ప్రోటీన్ కు మంచి వనరులు. ఎందుకంటే ఇవి ప్రోటీన్ తయారు చేయడానికి అవసరమైన తొమ్మిది పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి ప్రోటీన్ గొప్ప వనరులుగా పరిగణించబడతాయి. పాల ఉత్పత్తులు, గుడ్లలో విటమిన్ బి -12, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులలో అరుదుగా కనిపించే రెండు పోషకాలు. రెండింటినీ ప్రత్యామ్నాయంగా ఆహారంలో చేర్చుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వెజిటేరియన్లు పనీర్ తినడం వల్ల గుడ్లు తిన్నంత ప్రయోజనాన్ని పొందుతారు. గుడ్లు, పన్నీర్ తో పాటుగా చికెన్, జున్ను, బీన్స్, ముంగ్ బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, బ్రోకలీ వంటి వాటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లు, పన్నీర్ అలెర్జీ ఉన్న వారు వీటిని తినొచ్చు.