MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Health
  • ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన శానిటరీ ప్యాడ్స్ లేదా టాంపోన్లను వాడితే..!

ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన శానిటరీ ప్యాడ్స్ లేదా టాంపోన్లను వాడితే..!

శానిటరీ ప్యాడ్స్ లేదా టాంపోన్లను కొనేటప్పుడు వాటి ఎక్స్ పైరీ డేట్ ను చూసే అలవాటు ఎవరికీ ఉండదు. కానీ వీటి గడువు తేదీని తప్పకుండా చెక్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన వాటిని వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 25 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్కిన్ కేర్ అయినా, మేకప్ ప్రొడక్ట్స్ అయినా సరే వాటిని ఉపయోగించే ముందు ఖచ్చితంగా ఎక్స్ పైరీ డేట్స్ ను చెక్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని వాడితే  ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ మాదిరిగానే కొంతమంది ఆడవారు ఒకేసారి ఎక్కువ రుతుస్రావ ఉత్పత్తులను కొంటారు. చాలా మంది రుతుస్రావ ఉత్పత్తుల ఎక్స్ పైరీ డేట్ ను చెక్ చేయకుండా వాడుతుంటారు. కానీ ఇలా వాడటం అంత మంచిది కాదు. అందుకే మీరు ఉపయోగించే శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు లేదా మెన్స్ట్రువల్ కప్పుల ఎక్స్ పైరీ డేట్ ను ఖచ్చితంగా చూడండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గడువు తీరిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు

శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు ఎక్కువగా ఐదేళ్ల గడువు తేదీని కలిగి ఉంటాయి. అయితే మెన్స్ట్రువల్ కప్పులు చాలా సంవత్సరాలు ఉంటాయి. కానీ ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఖచ్చితంగా ఈ కప్పును మార్చాలి. గడువు తేదీలను చెక్ చేయడం, కాలం చెల్లిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గడువు ముగిసిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. గడువు తేదీ దాటిన ఉత్పత్తులు బ్లడ్ ను గ్రహించవు. ఇది లీకేజీ, అసౌకర్యానికి దారితీస్తుంది. గడువు ముగిసిన పీరియడ్ ఉత్పత్తుల్లో సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. 

37
Sanitary Products

Sanitary Products

దద్దుర్లు

గడువు తేదీ ముగిసిన శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లను వాడటం వల్ల దద్దుర్లు వస్తాయి. ప్యాడ్లు లేదా టాంపోన్లలోని రసాయనాల గడువు ముగియడం వల్ల దద్దుర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

47

అసాధారణ యోని ఉత్సర్గ

ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన రుతువిరతి ఉత్పత్తులను ఉపయోగిస్తే అసాధారణ యోని ఉత్సర్గ వస్తుంది. గడువు తీరిన ఉత్పత్తుల వాడకం వల్ల యోని చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. 
 

57

చర్మ అలెర్జీ

గడువు ముగిసిన శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడం వల్ల చర్మ అలెర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాలం చెల్లిన ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది. 
 

67

టాక్సిక్ షాక్ సిండ్రోమ్

గడువు తీరిన టాంపోన్ ను ఉపయోగించడం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే అరుదైన సమస్య వస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంలోకి వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

77

మీ శానిటరీ వస్తువులను ఎప్పుడూ కూడా బాత్ రూంలో ఉంచకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది. బాత్ రూంలో తేమ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉంచితే వాటికి ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే వీటిని ఎప్పుడూ కూడా మీ పడకగది వార్డ్రోబ్ వంటి పొడి ప్రాంతాల్లో నిల్వ చేయండి. వాటిని జార్లు లేదా కంటైనర్లలో నిల్వ చేయడానికి బదులుగా వాటి అసలు ప్యాకేజింగ్ లో ఉంచండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved