టేస్టీగా ఉన్నాయని వీటిని తింటే మీ పని అంతే..!
వంట చేసుకునే టైం లేదని జంక్ ఫుడ్ ను తింటూ ప్రతి రోజూ కూల్ డ్రింక్స్ ను తాగున్నారా. అయితే మీకు బోలు ఎముకల వ్యాధి నుంచి గుండె సంబంధిత వ్యాధులు రావడం ఖాయం.

శరీరానికి హాని కలిగించే ఆహారాలు మార్కెట్ లో ఎక్కడ వెతికినా దొరుకుతాయి. అలాంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఇంట్లోకి తెచ్చి తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆహారాల వల్ల వచ్చేది ఒక రోజు సమస్య కాదు.. మన శరీరానికి జీవితకాల సమస్యగా మారుతుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలతో సహా శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఎలాంటి ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూల్ డ్రింక్
మార్కెట్ లో ఎన్నో రకాల కూల్ డ్రింక్ బ్రాండ్లు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే ఈ కూల్ డ్రింక్స్ కు గిరాకీ బలే పెరిగిపోతుంది. మండుతున్న ఎండల్లో ఇవి చల్లని అనుభూతిని ఇస్తాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని ఎక్కువగా తాగుతుంటారు. కానీ వీటిని అతిగా తాగితే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, దంతాలు, బోలు ఎముకల వ్యాధి, డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు దీన్ని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. అందుకే వీటిని తాగడం మానేయండి
hot dog general
హాట్ డాగ్స్
నిపుణుల ప్రకారం.. ఈ వంటకాన్ని ఒక విదేశీ సంస్థ ప్రారంభించింది. కానీ ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ముఖ్యంగా నాన్ వెజ్ హాట్ డాగ్స్ మరింత హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో మాంసంతో వచ్చే కొన్ని హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కాలక్రమేణా పెరుగుతుంది. ఇది మన కడుపు, ఊపిరితిత్తులు రెండింటినీ దెబ్బతీస్తుంది. అయినప్పటికీ చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయని. కానీ దీన్ని తింటే శరీరానికి హాని కలిగిస్తుంది. అందుకే వీటిని తినడం తగ్గించండి.
ప్యాక్ చేసిన శాండ్ విచ్ లు
ఈ శాండ్ విచ్ లను ను పలు విదేశీ కంపెనీలు తయారు చేస్తున్నాయి. టేస్ట్ పరంగా కూడా కంపెనీలు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వవు. వీటి టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. కానీ శాండ్ విచ్ లను ఎక్కువగా తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కడుపులో సమస్యలను కలిగిస్తుంది. దీన్ని ప్రతిరోజూ అల్పాహారంలో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.
Cheese
కృత్రిమ జున్ను
ప్రపంచంలోని జనాభా బాగా పెరిగిపోయింది. కానీ జనాభాకు తగ్గట్టు పాల ఉత్పత్తి ఎక్కువగా లేదు. అందుకే స్వచ్ఛమైన జున్ను మార్కెట్లో లభిస్తుందన్న గ్యారంటీ లేదు. జున్ను ప్యాక్ చేసిన విధానం తాజాగా కనిపిస్తుంది. కానీ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి. ఇది మన శరీరానికి మంచిది కాదు. నకిలీ పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీ వాటికి దూరంగా ఉండాలి.
healthy food
ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లో వండిన ఆహారమే బెటర్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఫాస్ట్ ఫుడ్ ను తినేవారు ఎక్కువయ్యారు. చాలా మంది ఇంట్లో వండిని ఆహారాలను తక్కువగా, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు. మార్కెట్ లో అమ్మే వస్తువులు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కానీ ఇంట్లో వండిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాధులు కూడా సోకవు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి పౌష్టికాహారాన్ని తినండి.