రాత్రుళ్లు నిద్రపట్టడం లేదా..? ఒక్కసారి ఇలా చేసి చూడండి..!
ఈ రొటీన్ ని ఒక్క రోజు కాదు.. ప్రతిరోజూ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. అప్పుడు నిద్రపోవడానికి రెడీ అయ్యాం అనే విషయం మన బాడీకి కూడా అర్థమౌతుంది.
ఈరోజుల్లో చాలా మంది రాత్రిపూట సరిగా నిద్రపట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా నిద్రపట్టకపోవడానికి కారణాలు చాలానే ఉండొచ్చు. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు.. ఇలా కారణం ఏదైనా నిద్రరాక అవస్థలుపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే... కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. సులభంగా నిద్రపోవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి..
రాత్రి పడుకునే ముందు మనం చేసే కొన్ని పనుల ద్వారా వెంటనే నిద్రపట్టే అవకాశం ఉంటుంది. దాని కోసం మనల్ని మనం రాత్రికి తగినట్లుగా సెట్ చేసుకోవడం ముఖ్యం. అంటే.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం, స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వడం లాంటివి చేసి.. మనల్ని మనం సౌకర్యవంతంగా చేసుకోవాలి. అంతేకాదు.. పడుకునే బెడ్ కూడా నీట్ గా ఉంచుకోవాలి. అప్పుడు.. మనకు కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. ఈ రొటీన్ ని ఒక్క రోజు కాదు.. ప్రతిరోజూ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. అప్పుడు నిద్రపోవడానికి రెడీ అయ్యాం అనే విషయం మన బాడీకి కూడా అర్థమౌతుంది.
ఇది నిద్రను ప్రోత్సహించే పద్దతిలో ఇది కూడా ఒకటి. ఈ పద్ధతిలో, మీరు మీ శరీరంలోని ప్రతి భాగంపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ముందుగా పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. కాలి నుండి మీ దృష్టిని ప్రారంభించాలి. క్రమంగా, మీ తల వైపుకు కదలండి. చాలా సందర్భాలలో, ప్రజలు తమ తలపైకి దృష్టి పెట్టేలోగా నిద్రపట్టేస్తుందట.
మంచి నిద్రపట్టడం కోసం మీరు ప్రాణయామం చేయవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి,ఆందోళన కారణంగా మీరు నిద్రపోలేనప్పుడు ప్రాణాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నార్మల్ గా ఉదయంపూట చాలా మంది ప్రాణయామం చేస్తారు. కానీ.. రాత్రి పడుకునేముందు.. బెడ్ మీద ఈ ప్రాణయామం చేయాలి. కనీసం 7 సెకన్ల పాటు ఇలా చేయడం వల్ల.. మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
స్క్రీన్ వినియోగాన్ని నివారించండి
మీరు షెడ్యూల్ చేసిన నిద్ర సమయానికి కనీసం ఒక గంట ముందు ఎలాంటి స్క్రీన్ టైమ్‌ను నివారించడం మంచిది. ఈ స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి శరీరంలో మెలటోనిన్ (నిద్ర కలిగించే హార్మోన్) ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీకు వీలైతే, రాత్రిపూట మీ ఫోన్‌ని మీ బెడ్‌రూమ్‌లోకి తీసుకురాకండి.
ఆహారంపై దృష్టి పెట్టండి..
పడుకునేముందు పొట్ట పగిలేలా భోజనం చేయకూడదు. మీరు నిద్రించడానికి కనీసం మూడు గంటల ముందు తినండి. రాత్రిపూట నివారించవలసిన కొన్ని ఆహారాలలో చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు, సంతృప్త కొవ్వులు , కెఫిన్ ఉన్నాయి. నిద్రవేళకు ముందు పాలు లేదా అరటిపండు తినడం వల్ల నిద్రను ప్రేరేపించే ట్రిప్టోఫాన్ ఉన్నందున మీరు వేగంగా నిద్రపోవచ్చు.