మేకప్ వేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇవి పాటిస్తే ఎంత అందమో!
నలుగురిలో అందంగా, ప్రత్యేక ఆకర్షణగా కనిపించడానికి మేకప్ వేసుకుంటారు. కానీ మేకప్ (Makeup) వేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన చర్మానికి ఎటువంటి హాని కలగదు. మేకప్ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ను సరైన దిశలో వాడకపోతే అందులో ఉండే రసాయనాలు చర్మ సౌందర్యంపై (Skin beauty) ప్రభావం చూపుతాయి. ఫలితంగా చర్మ సమస్యలు ఏర్పడతాయి. కనుక మేకప్ వేసుకునే సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేకప్ వేసుకునే ముందు బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) వాడటం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. వీటిని సరైన దిశలో వాడకపోతే చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం నల్లబడటం, దద్దుర్లు, మంట మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఏర్పడతాయి. కనుక మేకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అయితే మేకప్ వేసుకోవడానికి పాటించవలసిన కొన్ని జాగ్రత్తల (Precautions) గురించి తెలుసుకుందాం..
మేకప్ వేసుకోవడానికి ముందు మన చేతులను శుభ్రపరచుకోవాలి (Hands should be cleaned). తరువాత మొదట ముఖానికి మాయిశ్చరైజర్ (Moisturizer) ను రాసుకున్న తర్వాతనే మేకప్ వేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ తాలూకా రసాయనాలు చర్మానికి హాని చేయవు. కనుక మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి.
మీ చర్మానికి సరిపోయే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) ను ఎంచుకోండి. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ మొదటిసారి మీరు వాడుతుంటే మీ శరీర తత్వానికి అవి సరిపోతాయో లేదో ఒకసారి పరీక్షించుకోండి. మీకు ఆ ప్రొడక్ట్స్ కారణంగా ఎటువంటి అలర్జీ, దద్దుర్లు, ఇబ్బంది (Trouble) లేదని నిర్ధారణ అయిన తర్వాత వాటిని ఉపయోగించడం మంచిది.
కళ్ళకు వేసుకునే మేకప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళ్ళకు ఉపయోగించే ప్రొడక్ట్స్ కారణంగా ఇన్ఫెక్షన్లు (Infections) వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళకు మేకప్ వేసుకున్నప్పుడు కళ్ల మంట, ఎరుపు, నీళ్లు కారడం వంటి కంటి సమస్యలు (Eye problems) ఏర్పడితే వెంటనే నీళ్ళతో కళ్ళను శుభ్రపరచుకోవాలి. అయినా కంటికి ఇబ్బంది కలిగితే పచ్చి పాలలో ముంచిన దూదితో తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మేకప్ ఉత్పత్తులను వాడే ముందు ముఖ్యంగా వాటి ముగింపు తేదీని (Expiry date) గమనించాలి. ఆ గడువు ముగింపు లోపలే వాటిని వాడాలి. మీరు మార్కెట్లో బ్యూటీ ఉత్పత్తులను కొనేముందు తప్పక ముగింపు తేదీని పరీక్షించాలి. గడువు అయిపోయినా ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తే చర్మ సమస్యలు (Skin problems) తలెత్తే అవకాశం ఉంటుంది.
మేకప్ ఉత్పత్తులను కొనేముందు మీ చర్మతత్వానికి సరిపడే మేకప్ ప్రొడక్ట్స్ (Makeup Products) ను ఎంచుకోవడం మంచిది. శాంపుల్
టెస్ట్ (Sample test) చేయకుండా ఏ కొత్త ఉత్పత్తులను వినియోగించడం మంచిది కాదు. ఇలా మేకప్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి ఎటువంటి హాని కలుగదు.