యవ్వనంగా, అందంగా కనిపించాలంటే ఈ ఫేస్ ప్యాక్స్‌లు ట్రై చెయ్యండి!
అందంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి చర్మానికి పైపై మెరుపులను అందిస్తాయి. ఇలాంటి పైపై మెరుపులు చర్మ సౌందర్యానికి శాశ్వత ఫలితాలను అందించవు.

కనుక సహజసిద్ధమైన పద్ధతిలో చర్మం లోపలి నుంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్స్ ను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీంతో వయసు పైబడిన కూడ యవ్వనంగా (Young) కనిపిస్తారు. ఇందుకోసం పాటించవలసిన ఫేస్ ప్యాక్స్ (Face packs) ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యవ్వనంగా, అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో డబ్బు వృధా చేయకుండా తక్కువ ఖర్చులో ఇంట్లో ఉండే వాటితో కొన్ని ఫేస్ ప్యాక్ ను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు (Aged shades), నల్లటి వలయాలు తగ్గి అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
బియ్యప్పిండి, కలబంద గుజ్జు, తేనె: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి (Rice flour), కొద్దిగా కలబంద గుజ్జు (Aloevera pulp), తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే చర్మ కణాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. దీంతో చర్మం తాజాగా నిత్యం యవ్వనంగా కనిపిస్తుంది.
సెనగపిండి, పసుపు, పెరుగు: ఒక కప్పులో కొద్దిగా సెనగపిండి (Gram flour), పసుపు (Turmeric), పెరుగు (Curd) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ ప్రయత్నిస్తే చర్మంపై ఏర్పడ్డ వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే చర్మానికి మంచి నిగారింపు కూడా అందుతుంది. కనుక ఈ ఫేస్ ప్యాక్ ను క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
రోజ్ వాటర్, పసుపు, గంధం పొడి: ఒక కప్పులో కొద్దిగా రోజ్ వాటర్ (Rose water), పసుపు (Turmeric), గంధం పొడి (Sandalwood powder) వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమంలో ఉండే పోషకాలు చర్మానికి మంచి ఫలితాలను అందించి చర్మం నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి.
పైన చెప్పిన ఫేస్ ప్యాక్ లలో ఏ ఒక్కదానినైనా అయినా క్రమం తప్పకుండా అనుసరిస్తే వయసు పెరిగే కొద్దీ ఏర్పడే వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ముందుగా ఈ ఫేస్ ప్యాక్స్ లను ప్రయత్నించే ముందు మీ చర్మ తత్వానికి (Skin philosophy) సరిపోతుందా లేదా అని పరీక్షించాకే అప్లై చేసుకోవడం మంచిది. అప్పుడే చర్మానికి మంచి ఫలితాలను (Good results) పొందగలరు.