టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతయా?
టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని చాలా మంది అంటుంటారు. మరి దీనిలో నిజమెంతంటే?

ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులు వీటిని అందుకోని విధంగా వీటి ధరలు కొన్ని రోజుల నుంచి పెరిగిపోతాయి. ఈ సంగతి పక్కన పెడితే.. టమాటా లేని కూరలు మనం అసలే వండం. ఈ ధరలు పెరిగిపోవడం వల్ల వీటికి బదులుగా ప్రత్యమ్నాయాలను వాడుతున్నారు. నిజానికి టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే టమాటాలను క్రమం తప్పకుండా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే ఈ భయంతో టమాటాలకు చాలా మంది వీలైనంత దూరంగా ఉంటున్నారు. కానీ టమాటాలు నిజంగా మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయన్న వాదనలో నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే టమాటాల వల్ల కిడ్నీళ్లో రాళ్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందట. అయితే రెగ్యులర్ టమాటాలు తినే వారందరికీ భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు వస్తాయని చెప్పడంలో నిజం లేదంటున్నారు నిపుణులు.
టమాటాల్లో ఉండే ఆక్సలేట్ అనే పదార్థం కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతుంది. మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నంటే ఇది టమాటాల్లో ఉండే ఆక్సలేట్ మళ్లీ రాళ్లను ఏర్పరుస్తుంది. కాబట్టి కిడ్నీ స్టోన్ ఉన్నవారు టమాటాలను ఎక్కువగా తినకూడదు. కానీ టమాటాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మూత్రపిండాల్లో రాళ్ల అంటే మీ ఇంట్లో ఎవరికైనా కిడ్నీల్లో రాళ్లు వచ్చిన వారున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు.
టమోటాల వల్ల కలిగే ఇతర నష్టాలు...
టమాటాలు మనకు పెద్దగా హాని కలిగించవు. అయితే కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఎసిడిటీ ఉన్నవారు టమాటాలను తింటే గుండెల్లో మంట వంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎసిడిటీ ఉన్నవారు టమాటాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Tomatoes
కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రం కొంతమందికి టమాటాలు అలెర్జీని కలిగిస్తాయి. అయితే ఇది చాలా అరుదు. ఇది కూడా టమాటాకు ప్రతికూలత అని చెప్పొచ్చు.
టమాటాలు కొన్ని మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. రక్తం గడ్డకట్టడానికి ఇచ్చే మందుల ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది కూడా టమాటాల వల్ల కలిగే సమస్యే. అయితే వీటన్నింటికీ టమాటాలను తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. టమాటాలు చాలా మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలను కలిగించవు.