వర్షాకాలం యోని సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.. యోని ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
వర్షాకాలం వర్షం, చలితో పాటుగా కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. దీనివల్ల యోని ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. వర్షాకాలంలో కొన్ని టిప్స్ ను ఫాలో అయితే యోని సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది.

వర్షాకాలంలో వాతావరణం మొత్తం తేమగా ఉంటుంది. దీనివల్ల ఈ సీజన్ లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళలకు. ఈ సీజన్ లో యోని, మూత్ర సంక్రమణ అవకాశాలు పెరుగుతాయి. వాతావరణంలో ఉండే తేమ బ్యాక్టీరియా, ఫంగల్ బాగా పెరిగేలా చేస్తుంది. ఈ సీజన్ లో యోని సంరక్షణ ముప్పు తప్పాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో యోనిపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరం?
తేమ కారణంగా ఇతర సీజన్లతో పోలిస్తే యోని సంక్రమణ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. మహిళలు బిగుతైన లోదుస్తులు, ప్యాంట్లు లేదా డ్రెస్సులు ధరించి గంటల తరబడి ఆఫీసు లేదా ఇంట్లో పనులు చేస్తుంటారు. దీంతో అక్కడ వేడి, తేమ పెరుగుతుంది. వేడి, తేమ బాక్టీరియల్ వాగినోసిస్, క్లామిడియల్ ఇన్ఫెక్షన్, గోనేరియా, కాండిడియాసిస్, ట్రైకోమోనియాసిస్ వంటి అంటు వ్యాధుల అవకాశాలను పెంచుతాయి. యోని పరిశుభ్రత, దాని వాసనను పట్టించుకోకపోవడం వల్ల యోని సంక్రమణకు ఎక్కువ అవకాశం ఉంది. టాంపోన్ లేదా శానిటరీ ప్యాడ్ ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది.
వర్షాకాలం యోని సమస్యలను పెంచుతుంది
నిపుణుల ప్రకారం.. ఇన్ఫెక్షన్.. యోని ఉత్సర్గ, యోని దురద, ఎర్రటి దద్దుర్లు, వాపు, చికాకు, యోని నొప్పికి కారణమవుతుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా సంభోగం సమయంలో చికాకు కూడా కలుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో హార్మోన్లు అసమతుల్యంగా ఉండటం వల్ల యోని పొడిబారుతుంది. ఇది యోనిలో దురద, చికాకును కలిగిస్తుంది. అయితే ఈస్ట్రోజెన్ క్రీములు ఈ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటితో కడగాలి
వర్షాకాలంలో యోని పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఇందుకోసం గోరువెచ్చని నీటితో యోనిని శుభ్రం చేసుకోవాలి. సువాసున్న సబ్బులను ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు యోనిని శుభ్రం చేయండి. అయితే యోనిని లోపలి నుంచి శుభ్రం చేయొద్దు. ఎందుకంటే ఇది రక్షిత బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మూత్ర విసర్జన చేసిన తర్వాత యోనిని కడిగి తుడవాలి. బ్యాక్టీరియా యోనిలోకి ప్రవేశించకుండా ఉండటానికి యోని ప్రాంతాన్ని ముందు నుంచి వెనకకు శుభ్రం చేయండి.
ప్రైవేట్ పార్ట్ జుట్టును షేవ్ చేయడం మానుకోండి
ప్రైవేట్ పార్ట్ వెంట్రుకలు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడతాయి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తగ్గుతాయి. ఇది సెక్స్ సమయంలో ఘర్షణను కూడా తగ్గిస్తుంది. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని కూడా నివారిస్తుంది. అందుకే ఈ సీజన్ లో జుట్టును పదే పదే షేవ్ చేయకండి. అంతకాదు దాన్ని కట్ చేయొద్దు కూడా. సెక్స్ తర్వాత యోని ప్రాంతాన్ని శుభ్రం చేయండి.
vaginal hygiene
బిగుతైన దుస్తులను ధరించడం మానుకోండి
ఈ సీజన్ లో టైట్ గా ఉండే బట్టలను వేసుకోకూడదు. కాటన్ లోదుస్తులనే వాడండి. టైట్ లోయర్ లేదా షార్ట్స్ లేదా స్కిన్ జీన్స్ ను వేసుకోవడం మానుకోండి. బిగుతుగా ఉన్న దుస్తులు గాలి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఇది చికాకును కలిగిస్తుంది. అలాగే ఈ సీజన్ లో తడి బట్టలను ఎక్కువ సేపు వేసుకోకూడదు. ఎందుకంటే ఇవి యోని ప్రాంతాల్లో చెమటను కలిగిస్తాయి. అలాగే చర్మ ఇన్ఫెక్షన్లను పెంచుతాయి. అందుకే శ్వాసించే దుస్తులనే వేసుకోండి. ఇవి జననేంద్రియాలు గాలి, వెలుతురు, పొడిగా ఉండటానికి సహాయపడతాయి.
vaginal health
పీరియడ్స్ సమయంలో అదనపు జాగ్రత్తలు
పీరియడ్స్ వల్ల యోని తేమగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములకు సంతానోత్పత్తి కేంద్రంగా మారుతుంది. ఇది యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఎంత తడిగా ఉన్నా ప్రతి 4 గంటలకు శానిటరీ ప్యాడ్స్, ప్రతి 2 గంటలకు టాంపోన్లను మార్చాలి. ప్రతి 8 గంటలకొకసారి పీరియడ్ కప్ ను మార్చండి. సువాసనలు వెదజల్లే ప్యాడ్స్ ను వాడకూడదు. టాంపోన్లు యోని పొడిబారడానికి కారణమవుతాయి. అందుకే మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగించండి.