MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బెల్లీ ఫ్యాట్ కరగాలా? అయితే వీటిని తినండి.. తొందరగా తగ్గుతుంది

బెల్లీ ఫ్యాట్ కరగాలా? అయితే వీటిని తినండి.. తొందరగా తగ్గుతుంది

బెల్లీ ఫ్యాట్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే మూడు పానీయాలను తాగినా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 30 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
belly fat

belly fat

ప్రస్తుతం చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయినా ఇది ప్రస్తుతం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ ఫ్యాట్ ను కరిగించడానికి ఆహార ప్రణాళికలు, వ్యాయామం చేయడం వంటి ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గత మూడు దశాబ్దాలలో ఊబకాయం మూడు రెట్లు పెరిగింది. ఈ ఊబకాయం డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆహార నియంత్రణ, వ్యాయామం వంటి కఠినమైన ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది బరువును మాత్రం తగ్గరు. 

26
belly fat

belly fat

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ స్థాయిలను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సహజ పదార్థాలు కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

36

త్రిఫల

ఆయుర్వేదం ప్రకారం.. త్రిఫల ఎన్నో రోగాలను నయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా త్రిఫల ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, ముఖ్యంగా పిరుదులపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో త్రిఫల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. త్రిఫలాన్ని మీ డైట్ లో చేర్చుకుంటే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. త్రిఫల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి మంటను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 

46
lemon juice

lemon juice

నిమ్మరసం

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే కూడా మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి, ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

56

అల్లం నీళ్లు

అల్లం ఒక శక్తివంతమైన మసాలా దినుసు. అందుకే దీనిని ఎన్నో ఏండ్లుగా ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తున్నారు. అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మంట తగ్గిపోతుంది. జీవక్రియను  పెంచడానికి కూడా అల్లం సహాయపడుతుంది. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియ రేటును పెంచి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడతాయి. 
 

66

కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు తినండి

మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బొడ్డు కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ ను తినడం తగ్గించండి. లేదా పూర్తిగా మానుకోండి. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను పెంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Recommended image2
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Recommended image3
Health : ఆల్కహాల్ అలవాటే లేకున్నా లివర్ డ్యామేజ్ అవుతుందా..! ఈ ఐదు విషయాలే కారణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved