వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో..!
కొన్ని ఆహారాలను తినడానికి ముందు ఖచ్చితంగా నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నానబెట్టడం వల్ల వీటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి. అలాగే..

కొన్ని ఆహారాల్లో పోషక విలువలను పెంచడానికి, వాటి వేడి స్వభావాన్ని తగ్గించడానికి వీటిని నీటిలో ఖచ్చితంగా నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కడుపు ఎన్నో సమస్యలకు దూరంగా ఉంటుంది. అలాగే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకు తినడానికి ముందు ఏయే ఆహారాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కాయధాన్యాలు
కాయధాన్యాలు, బీన్స్ వంటి ధాన్యాలను తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫైటేట్ అని పిలువబడే ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. ఫైటిక్ ఆమ్లాన్ని కొన్నిసార్లు యాంటీ-న్యూట్రియంట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇనుము, జింక్, కాల్షియం వంటి కొన్ని ప్రోటీన్లు, ఖనిజాలను బంధిస్తుంది. ఈ పోషకాలను బంధించడం వల్ల ఇది మన శరీరంలో గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో వీటి ప్రయోజనాల్ని పొందలేము.
మెంతులు
మెంతులను నీటిలో నానబెట్టడం వల్ల వీటిలోని ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. అలాగే వాటి లక్షణాలు కూడా పెరుగుతాయి. మెంతులు నీటిలో నానిన తర్వాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. మన జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
soaked badam
అవిసెగింజలు, బాదం
అవిసె గింజలు, బాదం పలుకులు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కానీ వీటిలో టానిన్ సమ్మేళనం ఉంటుంది. అందుకే ఈ రెండింటినీ నానబెట్టి తినండి. అంతేకాదు ఈ రెండింటినీ నానబెట్టిన తర్వాత తినడం వల్ల ఫైబర్, న్యూట్రీషియన్స్ పెరుగుతాయి. అలాగే వాటి ప్రోటీన్ కడుపులో వేడిని ఉత్పత్తి చేయదు.
mango
మామిడి పండ్లు
నీటిలో నానబెట్టిన మామిడి పండ్లను తినడం వల్ల వేడి తగ్గుతుంది. అలాగే మామిడిపండ్ల వేడి వల్ల కొందరికి దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఎండుద్రాక్ష
నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల శరీరంలో ఇనుము పరిమాణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇందులోని ఫైబర్ కంటెంట్ పెరిగి మలబద్ధకం, పైల్స్ ఉన్న రోగులకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ నానబెట్టే తినండి.