వీటిని తింటే లివర్ సమస్యలే రావు..
ఆహారం, జెనెటిక్స్, వ్యాయామం లేకపోవడం, మందుల వాడకం వంటివి మన కాలెయాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కాలెయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. మితిమీరిన మద్యపానం, ధూమపానం తరచుగా కాలేయ వ్యాధికి కారణమవుతాయి. అలాగే ఆహారం, జన్యుపరమైన కారకాలు, వ్యాయామం లేకపోవడం, మందుల వాడకం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాలెయ వ్యాధులు వచ్చేలా చేస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. కాలెయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వాటిని తినాలంటే..
బెర్రీలు
బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంుది. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మందు తాగడం వల్ల 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' లేదా కాలేయ వాపును నివారించడానికి బెర్రీలు ఎంతో సహాయపడతాయి.
<p>beet root</p>
బీట్ రూట్
బీట్ రూట్ ను తిన్నా.. జ్యూస్ గా చేసుకుని తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నైట్రేట్లు ఎక్కువగా ఉండే బీట్ రూట్ మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇవి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీ సల్ఫర్ పుష్కలంగా ఉండే కూరగాయ. ఇది కాలేయంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి ఎంతో సహాయపడుతుంది. బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.
apples
ఆపిల్
రోజుకో యాపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫైబర్ పుష్కలంగా ఉండే యాపిల్స్ కాలేయంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి అద్బుతంగా సహాయపడతాయి.
grapes for health
ద్రాక్ష
ద్రాక్ష పండ్లను తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
nuts
గింజలు
గింజలను మోతాదులో తింటే కాలెయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గింజల్లో ఉండే విటమిన్ ఇ కాలేయానికి చాలా అవసరం. కాబట్టి మీరు వాల్ నట్స్, నట్స్, బాదం వంటి పప్పులను పుష్కలంగా తినండి.
Avocado
అవొకాడో
అవోకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను నివారించడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అవోకాడోలలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.