కీళ్ల నొప్పులను తగ్గించే డ్రింక్స్ ఇవి..!
కీళ్ల నొప్పుల నడవడానికే కాదు కూర్చోవడానికి, నిలబడటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా వయసు పెరిగిన వాళ్లకే వస్తుంది. అయితే ఈ రోజుల్లో వృద్ధులతో పాటు మధ్య వయసు వారికి కూడా ఈ సమస్య వస్తుంది. కీళ్ల నొప్పులు కొన్ని రకాల డ్రింక్స్ తో కాస్త తగ్గుతాయి. అవేంటంటే?
వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో ఒకటి కీళ్ల నొప్పులు. ప్రస్తుత కాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వృద్ధులే కాదు 40 ఏండ్లున్న వారు కూడా దీని బారిన పడుతున్నారు. ఈ కీళ్ల నొప్పుల వల్ల నడవడానికి, కూర్చోవడానికి, నిలబడటానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
joint pain
కీళ్ల నొప్పులను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఎక్కువగా ఉండే పానీయాలను తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు కాస్త తగ్గుతాయి. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా ఏ డ్రింక్స్ తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయో తెలుసుకుందాం..
గ్రీన్ టీ
గ్రీన్ టీని సాధారణంగా బరువు తగ్గడానికే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఈ గ్రీన్ టీని తాగితే మీరు బరువు తగ్గడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు , పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కీళ్ల వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
milk
పాలు
పాలు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అందుకే మీరు పాలను తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఎముకలు బలంగా కూడా మారుతాయి.
Image: Getty Images
ఆరెంజ్ జ్యూస్
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది.
Cherry juice
చెర్రీ జ్యూస్
చెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. చెర్రీ జ్యూస్ ను తాగితే మీ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల వాపు వచ్చే అవకాశం కూడా ఉండదు.
వాటర్
ఆరోగ్యంగా ఉండటానికి మన శరీరంలో నీళ్లు ఉండటం కూడా చాలా ముఖ్యం. శరీరంలో ఉండే నీళ్లు మనల్ని ఎన్నో సమస్యలకు దూరంగా ఉంచుతాయి. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా కీళ్లను ఆరోగ్యం, బలంగా, మృదువుగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.