నోరూరించే ఎంతో రుచికరమైన ఆరెంజ్ పాన్ కేక్ ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!
ఆరెంజ్ తో పాన్ కేక్ తయారు చేసి పిల్లలకు ఇస్తే వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు. దీని తయారీ విధానం కూడా సులభం. తక్కువ సమయంలో చేసుకునే ఈ పాన్ కేక్ రుచికి (Taste) తిరుగుండదు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా మనం ఆరెంజ్ పాన్ కేక్ (Orange pancake) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ (Fruits) తినమంటే మారం చేస్తారు. ఫ్రూట్స్ ను తినడానికి ఇష్టపడరు. ఈ విషయంలో చాలా మంది తల్లులు దిగులు చెందుతున్నారు. ఇలా ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఫ్రూట్స్ తో వెరైటీ స్నాక్స్ ఐటమ్స్ (Variety snack items) ను ట్రై చేస్తే తినడానికి ఇష్టపడతారు.
కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పు గోధుమ పిండి (Wheat flour), సగం టీ స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), మూడు టేబుల్ స్పూన్ ల చక్కెర పొడి (Powdered sugar), ఒకటిన్నర టీస్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder),
పావు టీ స్పూన్ ఉప్పు (Salt), ఒక కప్పు చీజ్ (Cheese) తరుగు, గుడ్డు (Egg) ఒకటి, ముప్పావు కప్పు పాలు (Milk), సగం టీస్పూన్ ఆరెంజ్ జెస్ట్ (Orange Zest), సగం కప్పు ఆరెంజ్ జ్యూస్ (Orange juice), పావు కప్పు నెయ్యి (Ghee), కొన్ని చుక్కలు వెనిలా ఎసెన్స్ (Vanilla Essence).
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె (Bowl) తీసుకుని అందులో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చక్కెర పొడి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో చీజ్ (Cheese), పాలు, ఆరంజ్ జ్యూసు, నెయ్యి, ఆరెంజ్ జెస్ట్, వెనిలా ఎసెన్స్ (Vanilla Essence) వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో (Mixture) ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దోసె పిండిలా (Dose dough) కలుపుకోవాలి.
ఇప్పుడు ఆరెంజ్ పాన్ కేక్ తయారీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడిచేసుకోవాలి (Should be heated). ప్యాన్ వేడెక్కిన తరువాత కలుపుకున్నా పిండిని దోసెలాగా మందంగా (Thick) వేసుకోవాలి.
రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట (Low flame) మీద కాలనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత చేసిన పాన్ కేక్ ఒక ప్లేట్ (Plate) లో తీసుకోవాలి.
ఇలా మొత్తం కలుపుకున్న పిండిని తయారు చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే ఆరెంజ్ పాన్ కేక్ (Orange pancake) రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడ ఈ కేక్ ను ఒక సారి ట్రై చేయండి.