పంజాబీ స్టైల్ బ్రెడ్ పకోడీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బ్రెడ్‌తో బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ శాన్విచ్ వంటి ఇతర స్నాక్స్ ను ట్రై చేస్తూంటాం. అదేవిధంగా పంజాబీ స్టైల్ లో చేసుకునే బ్రెడ్ పకోడీలు కూడా చాలా రుచిగా బాగుంటాయి. ఈ స్నాక్ తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం పంజాబీ స్టైల్ బ్రెడ్ పకోడీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఆరు బ్రెడ్ స్లైసెస్ (Bread slices), ఒక కప్పు సెనగపిండి (Gram flour), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం స్పూన్ కారం పొడి (Chilli powder), సగం స్పూన్ చాట్ మసాలా (Chat Masala).
సగం స్పూన్ గరం మసాలా (Garam masala), పావు స్పూన్ పసుపు (Turmeric), పావు స్పూన్ వంట సోడా (Baking soda), సగం స్పూన్ జీలకర్ర (Cumin), పావు స్పూన్ వాము (Bishopsweed), కొత్తిమీర (Coriander) తరుగు, ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil).
పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర (Coriander), ఒక కట్ట పుదీనా (Mint), మూడు పచ్చిమిరపకాయలు (Green chilies), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రుచికి సరిపడా ఉప్పు (Salt).
తయారీ విధానం: ఒక గిన్నెలో సెనగపిండి, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, జీలకర్ర, కారం పొడి, వాము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు (Lump) లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
పుదీనా చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకొని అంచులను కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీ అప్లై చేసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైసెస్ ను ఒకదానిపై ఒకటి పెట్టి ట్రయాంగిల్ షేప్ (Triangle shape) లో కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె (Oil) వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైసెస్ ను సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఎక్కువ మంట మీద ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ ను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి బ్రెడ్ పకోడీ రెడీ. ఈ బ్రెడ్ పకోడీలను టమోటా సాస్ (Tomato sauce) తో తీసుకుంటే భలే రుచిగా (Tastefully) ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.