ఎంతో రుచికరమైన హెల్తీ పన్నీర్ మంచూరియా రెసిపీ ఇంట్లోనే ఎలా చెయ్యాలంటే?
మనం గోబీ మంచూరియా, ఆలు మంచూరియా, ఎగ్ మంచూరియా ఇలా ఎన్నో రిసిపిలను ట్రై చేసి ఉంటాం. అయితే పన్నీర్ తో కూడా మంచూరియాను తయారుచేసుకోవచ్చు అని మీకు తెలుసా! పన్నీర్ మంచూరియా ఒక మంచి హెల్తీ రెసిపీ (Healthy recipe). తక్కువ సమయంలో తక్కువ నూనెతో చేసుకోవచ్చు. దీని తయారీ విధానం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఎంతో రుచికరమైన పన్నీర్ మంచూరియా (Paneer Manchuria) రెసిపి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: 250 గ్రాముల పన్నీర్ ముక్కలు (Paneer), మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక ఉల్లిపాయ (Onion), ఒక పెద్ద క్యాప్సికం (Capsicum), ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ (Green chilli paste), 2 టేబుల్ స్పూన్ ల స్ప్రింగ్ ఆనియన్స్ (Spring onions), రెండు టేబుల్ స్పూన్ ల టమోటా సాస్ (Tomato sauce), రెండు టేబుల్ స్పూన్ ల సోయా సాస్ (Soya sauce), ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు (Garlic), రుచికి సరిపడా ఉప్పు (Salt), నూనె (Oil).
తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నె (Bowl) తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి (Mix well). తర్వాత ఈ మిశ్రమాన్ని పన్నీర్ ముక్కలకు బాగా పట్టించాలి.
తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ (Non-stick pan) పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పన్నీర్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు (Paneer Pieces) బాగా వేగిన తర్వాత మంచి కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్ లో కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత ఇందులో టమోటా సాస్ (Tomato sauce), సోయా సాస్ (Soya sauce) వేసి కలుపుకోవాలి.
తర్వాత ఒక గ్లాసులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ (Corn flour), అరకప్పు నీళ్లు (Water) పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పాన్ లో పోయాలి. ఈ మిశ్రమం బాగా వేడెక్కి చిక్కగా తయారవుతుంది.
ఇలా మిశ్రమం చిక్కబడే సమయంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి నిదానంగా కలుపుకోవాలి (Mix slowly). లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఐదు నిమిషాల పాటు తక్కువ మంట (Low flame ) మీద ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ (Serve) చేయండి. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ పన్నీర్ మంచూరియా రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.