గోర్లు, జుట్టు దెబ్బతింటే ఆ సమస్య ఉన్నట్టేనా?
మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. ఇవి మనకు సరిపడా అందినప్పుడు శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. లోపిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మన శరీరంలోని వివిధ విధులు సక్రమంగా జరగాలంటే మనకు అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఇతర పోషకాలు ఎప్పటికప్పుడు పొందాలి. అవసరమైన కారకాలు తగ్గినప్పుడు అది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు దారితీస్తుంది. మన శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కూడా ఎన్నో రోగాలు వస్తాయి. శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాల లోపం
కండరాలను పోషించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ తోనే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఇది కండరాల నష్టానికి దారితీస్తుంది.
గోళ్లు, వెంట్రుకలు దెబ్బతింటాయి
గోర్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది. అయితే మన శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే గోర్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటాయి. గోర్లు విరిగిపోతాయి. జుట్టు సన్నబడుతుంది. జుట్టు రంగు మారుతుంది. లేదా చర్మంపై అక్కడక్కడ ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. ఇవన్నీ ప్రోటీన్ లోపానికి సంకేతం కావొచ్చు.
ఎముక విరిగిపోయే అవకాశం
ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఇది సహజంగా ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రోటీన్ లోపం బలహీనమైన ఎముకలకు దారితీస్తుంది. తర్వాత ఎముకలు విరిగిపోతాయి.
ఆకలి పెరుగుతుంది
ప్రోటీన్లు ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువగా తినకుండా నిరోదిస్తాయి. ఇది మన ఆకలిని అణిచివేసే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడే ప్రోటీన్.అందుకే ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఆకలి పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి తగ్గొచ్చు
మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ప్రోటీన్ చాలా అవసరం. అందుకే ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనిలో భాగంగా అనేక ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధులు తరచుగా వచ్చే అవకాశం ఉంది.