వీటిని తిన్నా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్టే తగ్గిపోతాయి..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి చిన్న సమస్యగా కనిపించినా ఇది ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఒత్తిడిని చిన్న సమస్యగా తీసుకుని లైట్ తీసుకుంటే ఎన్నో రోగాల బారిన పడతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం తినే ఆహారాలలో కొన్ని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి మీ శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన పోషకాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి ఫుడ్స్ ను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరం కార్టిసాల్ ఉత్పత్తి పెరగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన, తీపి, ఉప్పగా ఉండే భోజనాన్ని చేయడం వల్ల కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తాత్కాలికంగా మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇవి మన మెదడును ఆనందంగా ఉంచుతాయి. కానీ ఆ తర్వాత ఒత్తిడిని బాగా పెంచుతాయి. కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు అన్నీ కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయి. ఆందోళన లక్షణాలను మరింత దిగజార్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, విటమిన్లతో పాటు, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, అలసట వంటి అనేక శరీర సమస్యలను తగ్గించడానికి సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ ..
Blueberries
బ్లూబెర్రీలు
బ్లూబెర్రీలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించే ప్రభావాలను కలిగి ఉన్నాయని తేలింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రెండూ ఆందోళన రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. బ్లూబెర్రీలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని, యువకులలో నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుందని చూపించింది. ప్రతిరోజూ మీ ఆహారంలో గుప్పెడు బ్లూబెర్రీలను చేర్చడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
സാൽമൺ
సాల్మన్
సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇపీఏ (ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లం), డిహెచ్ఎ (డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం) ఉంటాయి. ఒమేగా -3 కొవ్వులు ఆక్సీకరణ ఒత్తిడిని మెరుగుపరచడానికి మెదడు పనితీరును మెరుగేపరిచి ఆందోళనను నియంత్రించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్ పే క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల సహజ వనరు లభిస్తుంది. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వాల్ నట్స్, అవిసె గింజలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప వనరు. ఇవి ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి.
అరటిపండ్లు
అరటిపండ్లు మెగ్నీషియానికి మంచి మూలం. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన 2004 అధ్యయనం.. మెగ్నీషియం మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని సూచించింది. ఒక పెద్ద అరటిపండులో 37 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అరటిపండు తక్కువ హృదయ స్పందన రేటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆందోళన, మూడ్ స్వింగ్స్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
Image: Getty
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. విటమిన్ సి మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిరూపించబడింది. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
బీన్స్, చిక్కుళ్లు
2017 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. చిక్కుళ్లలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిక్పీస్, కాయధాన్యాలు, బీన్స్, ఇతర చిక్కుళ్ళు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి 6, మెగ్నీషియాన్ని కలిగి ఉంటాయి. ఉడకబెట్టిన, స్టిర్-ఫ్రై వంటకాల్లో ఎర్ర మాంసానికి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించొచ్చు. ఎందుకంటే ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పవర్ హౌస్ లు