సండే స్పెషల్... టేస్టీ స్పైసీ పుదీనా చికెన్ రెసిపీ ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
చాలా మంది చికెన్ తో తినడానికి ఇష్టపడతారు. చికెన్ తో ఎప్పటికప్పుడు కొత్త రుచులను ట్రై చేస్తే ఇంటిల్లపాది తినడానికే ఇష్టపడతారు.

అందుకే ఈ సారి పుదీనా రుచుల్లో చికెన్ ను వండేయండి. పుదీనాతో చేసుకునే చికెన్ చాలా స్పైసీగా (Spicy) టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం పుదీనా చికెన్ (Mint Chicken) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
తక్కువ పదార్థాలతో (Less ingredients), తక్కువ సమయంలో చేసుకొనే ఈ చికెన్ తయారీ విధానం (Method of preparation) కూడా సులభం. పుదీనా వాసనతో గుమగుమలాడుతుండే చికెన్ ను అన్నంలోకే కాదు, రోటీల్లోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు తప్పక నచ్చుతుంది.
కావలసిన పదార్థాలు: అర కేజీ చికెన్ (Chicken), పావు కప్పు పెరుగు (Yogurt) రెండు ఉల్లిపాయలు (Onions), నాలుగు పచ్చిమిరపకాయలు (Chillies) రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక కప్పు కొత్తిమీర (Coriander) తరుగు, ఒక కప్పు పుదీనా ఆకులు (Mint leaves) ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
ఒక టేబుల్ స్పూన్ వెన్న (Butter), ఒక టేబుల్ స్పూన్ కసూరి మేథీ (Kasuri Mathi), సగం స్పూన్ మిరియాలపొడి (Pepper powder) సగం స్పూన్ జీలకర్రపొడి (Cumin powder) ఒక స్పూన్ గరం మసాలా (Garam masala) రెండు యాలకులు (Cardamom) పావుకప్పు నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ (Mixi Jar) తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె, వెన్న వేసి వేడి చేయాలి.
వెన్న కరిగిన తరువాత అందులో యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై (Fry) చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా, జీలకర్ర పొడి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి (Mix well).
తరువాత ఇందులో పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తరువాత చివరిలో కసూరి మేథీ (Kasuri Mathi), కొత్తిమీర (Coriyander) వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ పుదీనా చికెన్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.
ఈ రెసిపీను అన్నంలోకి లేదా రోటీలతోను తీసుకుంటే భలే టేస్టీగా (Tasty) ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు చికెన్ తో కొత్త రుచులను (New flavors) ట్రై చేయండి. పిల్లలు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు.