సమ్మర్ స్పెషల్.. మామిడికాయ కొబ్బరి పులిహోర ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?
వేసవికాలంలో లభించే పచ్చి మామిడి (Raw mango) కాయల తురుముతో చేసుకునే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఈ పులిహోర తయారీ విధానం కూడా సులభం.

పండుగ రోజున ఇలా సీజన్ లో లభించే పచ్చి మామిడి కాయలతో పులిహోరను ట్రై చేస్తే ఇంటిల్లపాది తినడానికే ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మామిడికాయ కొబ్బరి పులిహోర (Mango Coconut Pulihora) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
పచ్చి మామిడి కాయలు, కొబ్బరి తురుముతో చేసుకునే పులిహోర రుచికి (Taste) పుల్ల పుల్లగా పచ్చిమామిడి సువాసనలతో (Fragrance) చాలా రుచిగా ఉంటుంది. వంటింటిలో పచ్చిమామిడికాయలు అందుబాటులో ఉన్నప్పుడు పచ్చడి, మామిడి పప్పుకు బదులుగా ఈ సారి పులిహోరను ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ పులిహోర తప్పక నచ్చుతుంది.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం (Rice), సగం కప్పు పచ్చి మామిడికాయ (Raw mango) తురుము, పావు కప్పు కొబ్బరి తురుము (Coconut grater), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ మిరియాలు (Pepper), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు ఎండుమిరపకాయలు (Dried chillies), సగం స్పూన్ ఆవాలు (Mustard).
ఒక స్పూన్ మినపప్పు (Minapappu), ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు (Senagapappu), పావు స్పూన్ పసుపు (Turmeric), రెండు టేబుల్ స్పూన్ ల జీడిపప్పు (Cashew), పావు కప్పు పల్లీలు (Peanuts), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు, కొత్తిమీర (Coriander) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని (Rice) కడిగి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పొడిపొడిగా అన్నం వంటి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, మిరియాలు, మినప్పప్పు, జీడిపప్పు, శెనగపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి.
తరువాత కరివేపాకు, మామిడి తురుము, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇవన్నీ వేగిన తరువాత చివరిలో కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని అన్నం పైన వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ కొబ్బరి పులిహోర రెడీ (Ready).
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రిసిపిని ట్రై చేయండి. పచ్చి మామిడి కాయలు, కొబ్బరి తురుముతో చేసుకునే పులిహోర (Pulihora) రుచికి తిరుగుండదు. పండుగ రోజున ఎప్పుడూ చేసుకునే పులిహోరలకు బదులుగా ఈ సారి కాస్త వెరైటీగా (Variety) పచ్చి మామిడి కాయలతో పులిహోరను ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు కొత్త రుచులతో వంటలను వండుకొని రుచులను ఆస్వాదించండి.