క్లాత్ మాస్క్ లతో కరోనా కి చెప్పండి గుడ్ బై..!
మనకు సులభం గా లభించే క్లాత్ మాస్క్ లతో కరోనాకి చెక్ చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై తాజాగా లండన్ కి చెందిన మాక్ మాస్టర్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది.
కరోనా వైరస్ దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో నుంచి బటయకు అడుగుపెట్టాలంటే.. మూతికి మాస్క్ తప్పనిసరి. కనీసం ఆ మాస్క్ ఉంటే.. వైరస్ ని అరికట్టవచ్చని అందరి నమ్మకం. మరీ ముఖ్యంగా చాలా మంది ఎన్95 మాస్క్ లను విపరీతంగా వాడుతున్నారు. వాటితో కరోనా కి దూరంగా ఉండవచ్చనే భావన అందరిలోనూ ఉంది. అయితే.. ఒక్కసారి గా ఆ మాస్క్ లపై కేంద్రం షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఎన్95 మాస్క్ ల వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదని తేల్చి చెప్పింది. కరోనా నుంచి రక్షించేందుకే ఎన్-95 మాస్కులు ఉపయోగపడుతాయని మొన్నటి వరకు అందరూ భావించారు. వాటిని విపరీతంగా కొనుగోలు చేశారు. డిమాండ్ కూడా వాటికి పెరిగిపోయింది.
వాల్వ్స్ ఉన్న ఎన్95 మాస్క్‌లు కూడా వాడకూడదు. ఇవి ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాల్లో వాడేందుకు మాత్రమే తయారయ్యాయి. ఇవి తొడుక్కుంటే గాలిని 95 శాతం వరకు ఫిల్టర్ చేసి పొల్యూటెడ్ ఎయిర్‌నుంచి రక్షణ కల్పిస్తాయి.
అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. కానీ, కరోనా టైమ్‌లో వైరస్‌ల నుంచి ఇవి రక్షణ కల్పించలేవు. ఎవరైనా కరోనా పేషెంట్స్, అసింప్టమాటిక్ కరోనా క్యారియర్స్ ‘వాల్వ్ మాస్క్’ తొడుక్కున్నా.. వాళ్ల నుంచి ఇతరులకు కరోనా వస్తుందని చెప్పింది.
ఈ వార్త అందరినీ కలవరపెట్టింది. అయితే.. మనకు సులభం గా లభించే క్లాత్ మాస్క్ లతో కరోనాకి చెక్ చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై తాజాగా లండన్ కి చెందిన మాక్ మాస్టర్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది.
కేవలం జలుబు, తుమ్ములు ఉన్నవారు మాత్రమే మాస్క్ వేసుకోవాలనే నియమం లేదని.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెబుతున్నారు.
కరోనా సోకిన వ్యక్తి కనుక మాస్క్ పెట్టుకుంటే.. అతను తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు.. వైరస్ బయటకు రాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.
మాస్క్ లను ఒకసారి వాడిన తర్వాత వాటిని శుభ్రం చేసిన తర్వాతే మళ్లీ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు ఒక్కసారి వాడి పారేసే మాస్క్ లు వాడుతుంటారు.. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయం కూడా మంచిది కాదని.. అలా పడేసినా వైరస్ ఇతరులకు అంటే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక క్లాత్ మాస్క్ ల విషయానికి వస్తే.. మనకు తగినట్లు ఇంట్లోనే కుట్టుకునే అవకాశం ఉంది. వీటిని ఇంట్లోనే ఉతికి శుభ్రం చేసుకోవచ్చు. ఉతికిన తర్వాత ఎండలో ఆరబెడితే.. క్రిములు చనిపోతాయి.
ఈ క్లాత్ మాస్క్ లను వినియోగించిన తర్వాత వేడి నీటిలో ఉతికితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు కేవలం ఒక్క మాస్క్ తో కాకుండా కనీసం వెంట రెండు, మూడు తీసుకువెళ్లడం ఉత్తమమని చెబుతున్నారు.
ఈ మాస్క్ లను ఉతికే క్రమంలో లైజాల్ వంటివి వాడకుండా ఉండటమే మంచిది. వాటి వల్ల వైరస్ చనిపోవడం పక్కన పెడితే.. చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
సో.. ఇక నుంచి క్లాత్ మాస్క్ లను మాత్రమే వాడండి. వాటితోనే కరోనాని అరికట్టవచ్చు.