స్పైసీ రవ్వ బాల్స్.. ఇంట్లోనే ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా?
వంటింట్లో అందుబాటులో ఉండే రవ్వతో కేవలం ఉప్మా, కేసరి, రవ్వ లడ్డులను మాత్రమే కాదు మరెన్నో రుచులను ట్రై చేయొచ్చు. ఈసారి కాస్త వెరైటీగా రవ్వ బాల్స్ ను ట్రై చేయండి.

ఈ రెసిపీ స్పైసీగా తినడానికి భలే రుచిగా (Delicious) ఉంటుంది. ఈ రెసిపీ మీ పిల్లలకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం స్పైసీ రవ్వ బాల్స్ (Spicy Ravva Balls) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ (Ravva), ఒక పచ్చిమిర్చి (Chili), రెండు కప్పుల నీళ్లు (Water), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు కప్పు పచ్చికొబ్బరి తురుము (Coconut grater), మూడు స్పూన్ ల నూనె (Oil).
పోపుకోసం: ఒక స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), సగం స్పూన్ మినప్పప్పు (Minappappu), సగం స్పూన్ సెనగపప్పు (Senagapappu), ఐదు జీడిపప్పు (Cashew), కొన్ని కరివేపాకు (Curries) రెబ్బలు, ఒక ఎండుమిర్చి (Dried chilli), పావు స్పూన్ పసుపు (Turmeric), పావు స్పూన్ కారం (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొత్తిమీర (Coriyander) తరుగు, రెండు స్పూన్ ల నిమ్మరసం (Lemon juice), మూడు స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి రవ్వ వేసి తక్కువ మంట (Low flame) మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేడేక్కిన తరువాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వేగిన తరువాత నీళ్లు (Water) పోసి రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి తురుము వేసి మరిగించాలి.
నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంట చిన్నగా చేసి రవ్వను పోస్తూ బాగా కలుపుతూండాలి (Mix well). రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి రవ్వ పూర్తిగా మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికిన (Well cooked) తరువాత స్టవ్ ఆఫ్ చేసి చపాతి పిండిలా కలుపుకోని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఐదు నిమిషాల తరువాత రవ్వను చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ లను పదినిమిషాలు ఆవిరిపై (Steam) ఉడికించుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ పై కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిలను వేసి వేయించుకోవాలి.
ఇవి వేగిన తరువాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఆవిరిపై ఉడికించుకున్న బాల్స్ లను వేసి బాగా కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే రవ్వ బాల్స్ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ రవ్వ బాల్స్ లను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.