వడదెబ్బ తగలొద్దంటే ఏం చేయాలో తెలుసా?
ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు బాగా కొడతాయి. ఈ ఎండలు చాలా ప్రమాదకరం. మండుటెండల్లో తిరిగితే వడదెబ్బ తిగిలే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి వడదెబ్బ కూడా ప్రాణాలను తీసేయగలదు. అందుకే వడదెబ్బ తగలకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
heat waves
ఏప్రిల్ నెల మొదలైనప్పటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు చాలా దారుణంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేడి, వడగాల్పుల కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. స్కూలుకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే వృద్ధులు, ఎండలకు పనులకు వెళ్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ. వీరికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు మనం చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం పదండి.
Hydration
మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి
ఎండాకాలంలో నీళ్లను బాగా తాగాలి. అప్పుడే మీరు హైడ్రేట్ గా ఉంటారు. లేదంటే మీ శరీరం డీహైడ్రేట్ బారిన పడి అనారోగ్యనాకి గురవుతారు. ఎండకు బయటకు వెళితే మీతో పాటు ఖచ్చితంగా వాటర్ బాటిల్ ను తీసుకెళ్లండి. అలాగే ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.
summer heat
ఇంటి నుంచి బయటకు రావొద్దు..
అత్యవసరముంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. చాలా మంది ఇంట్లో బోర్ కొట్టి అలా బయటకు వెళ్తుంటారు. కానీ ఎండాకాలంలో మీరు ఇలా మాటిమాటికి బయటకు వస్తే వడగాలుల కారణంగా అనారోగ్యానికి గురవుతారు. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది.
ఫిజికల్ యాక్టివిటీ వద్దు
ఎండాకాలంలో శారీరక శారీరక శ్రమ ఎక్కువగా చేయకూడదు. ఈ సీజన్ లో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినండి. అలాగే బయటకు వెళ్లే సమయంలో దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులను ఎక్కువగా వేసుకోవాలి.
ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు
ఎండాకాలంలో ఖాళీ కడుపుతో బయటకు అసలే వెళ్లకూడదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో బయటకు వెళితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే మీరు బయటకు వెళ్ళే ముందు పుష్కలంగా ఆహారం తినండి. కొబ్బరి నీళ్లను కూడా బాగా తాగాలి.