టైట్ బ్రా వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
ప్రస్తుత కాలంలో రొమ్ము క్యాన్సర్ సర్వ సాధారణమైపోయింది. అయితే రొమ్ము క్యాన్సర్ గురించి ఉన్న కొన్ని అపోహలు మహిళలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్యాన్సర్ పై ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

breast cancer
రొమ్ము క్యాన్సర్ మహిళలకు వచ్చే ప్రాణాంతక వ్యాధి. ఈ క్యాన్సర్ ప్రస్తుతం సర్వ సాధారణ రోగంగా మారిపోయింది. రోజు రోజుకు దీని కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికితోడు దీనికి సంబంధించిన అపోహలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. రొమ్ముల సైట్, బ్రా, తల్లి పాలివ్వడంతో సహా అనేక విషయాలు రొమ్ము క్యాన్సర్ తో ముడిపడి ఉన్నాయి. అందులో నిజమెంతా, అబద్దమెంత అన్న విషయాలు సాధారణంగా సామాన్యలుకు తెలియదు. అందుకే మహిళల ఆరోగ్యం కోసం రొమ్ము క్యాన్సర్ పై ఉన్న అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ 1: రెండు రొమ్ముల పరిమాణంలో తేడా ఆరోగ్య ప్రమాదాన్ని సూచిస్తుంది!
వాస్తవం: ప్రతి మహిళ రొమ్ముల పరిమాణం భిన్నంగా ఉంటుంది. అలాగే రెండు రొమ్ముల ఆకారం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో చాలా తేడా ఉంటుంది, కొన్నింటిలో చాలా తక్కువ తేడా ఉంటుంది. ఇది సర్వ సాధారణమైంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇది సమస్యలకు సంకేతం కాదు కూడా.
అపోహ 2: తల్లి పాలివ్వడం వల్ల వక్షోజాలు వదులుగా మారుతాయి
వాస్తవం: ఈ విషయాన్ని చాలా మంది ఆడవారు నమ్ముతారు. వృద్ధాప్యం రొమ్ముల సడలింపునకు కారణమవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. దీని వల్ల చర్మం వదులుగా మారుతుంది. అంతేకాకుండా బరువు పెరగడం వల్ల కూడా మీ రొమ్ములు వదులుగా మారుతాయి.
అపోహ 3: టైట్ బ్రాలు, డియోడరెంట్లు ఉపయోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది
వాస్తవం: టైట్ బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనే విషయంపై శాస్త్రీయ పరిశోధనలు లేవు. కాకపోతే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే డియోడరెంట్, పాల ఉత్పత్తులు, మొబైల్ ఫోన్ల వాడకంపై ఎటువంటి పరిశోధనలు జరగలేదు. అయినప్పటికీ మీరు టైట్ బ్రాలను ధరించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీకు సౌకర్యవంతంగా ఉండదు. ఇది మీ వక్షోజాలను కుదించుతుంది.
అపోహ 4: Nipple piercing రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి
వాస్తవం: Nipple piercing వల్ల చాలా నొప్పిగా ఉంటుంది. నిజానికి ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇది రొమ్ము క్యాన్సర్ తో ముడిపడి ఉందని ఎలాంటి పరిశోధనలు వెళ్లడించడం లేదు. కాకపోతే ఇది క్యాన్సర్ కాకుండా వివిధ రకాల రొమ్ము ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీనివల్ల చనుమొనలో చీము నిండుతుంది. అలాగే Nipple piercing వల్ల మీరు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది పాల వాహికను మూసేస్తుంది. ఇది నరాలను కూడా దెబ్బతీస్తుంది. అందుకే దీనికి దూరంగా ఉండండి.
అపోహ 5: చనుమొన ఉత్సర్గ రొమ్ము క్యాన్సర్ ను సూచిస్తుంది
వాస్తవం: రొమ్ము క్యాన్సర్ వల్ల ఎప్పుడూ కూడా చనుమొనల నుంచి ఉత్సర్గ రాదు. థైరాయిడ్ సమస్యలు, పీసీఓఐఎస్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు వంటి కొన్ని కారణాల వల్ల చనుమొనల నుంచి ఉత్సర్గ వస్తుంది. అందుకే బ్రెస్ట్ డిశ్చార్జ్ అయినప్పుడు కంగారు పడకండి. హాస్పటల్ వెళ్లి చెకప్ లు చేయించుకోండి.
<p>breast tenderness</p>
అపోహ 6: వృద్ధ మహిళలకు మాత్రమే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది
వాస్తవం: రొమ్ము క్యాన్సర్ 25 నుంచి 30 ఏండ్ల వారికి కూడా వస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో కూడా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న మహిళలే కాదు అన్ని వయసుల మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, దానిపై సరైన అవగాహన ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు