చలికాలంలో బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే షాక్ అవుతారు
చలికాలంలో బట్టలు లేకుండా పడుకోవడమా? ఛాన్సే లేదు.. చలికి చచ్చిపోతాం అని చాలా మంది అంటుంటారు. నిజానికి చలికాలంలో బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా? ఇది మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
naked sleep
మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు.. విశ్రాంతి, నిద్ర కూడా చాలా అవసరం. అలసటను పోగొట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. నిజానికి నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతి రోజూ 8-9 గంటల నిద్ర పోవాలి. నిద్రను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఉదయం పూటే చాలా మంది బాగా నిద్రపోతారు. అందుకే చాలా మంది ఉదయం తొందరగా నిద్రలేవరు.
naked sleep
చలికాలంలో మనం ప్రశాంతంగా, వెచ్చగా పడుకోవడానికి సౌకర్యవంతమైన దుప్పట్లను కప్పుకుంటూ ఉంటాం. ఈ సీజన్ లో దుప్పట్లు కప్పుకోకుండా పడుకోని వారు ఎవరూ ఉండరేమో. కానీ చలికాలంలో బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
బట్టలు లేకుండా నిద్రపోవడం మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నిజానికి రాత్రిపూట టైట్ బట్టలను వేసుకుని పడుకోవడం వల్ల మన రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మన రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. అందుకే నగ్నంగా నిద్రపోతే రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. దీంతో ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు మన చర్మానికి, జుట్టు కణాలకు అందుతాయి. దీతో మీ చర్మం, జుట్టు మరింత మెరుస్తాయి. మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే చర్మంపై ఉండే ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి.
శరీర ఉష్ణోగ్రత అదుపులో
చ0లికాలంలో బట్టలు లేకుండా పడుకుంటే మన శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల అధిక వేడి లేదా చెమట నుంచి ఇది మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మం, జుట్టును పొడిగా చేస్తుంది. అలాగే జుట్టును విచ్ఛిన్నం కూడా చేస్తుంది.
బరువు తగ్గడానికి..
బట్టలు లేకుండా నిద్రపోవడం కూడా బరుతు తగ్గుతారు తెలుసా? నిజానికి ఇది కేలరీలు, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే నగ్నంగా నిద్రపోవడం వల్ల మీ శరీరం దాని ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి కష్టపడుతుంది. ఇది బరువు తగ్గడానికి, మీ కండరాలను టోన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
బట్టలు లేకుండా పడుకున్నప్పుడు మీ ప్రైవేట్ భాగంలో తేమ, వేడి చాలా వరకు తగ్గుతాయి. తేమ, వేడి వల్ల అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మొటిమలు వంటి చర్మ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లన్నీ చికాకు, వాపు, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే మీకు గాయాలు, దద్దుర్లు ఉంటే నగ్నంగా నిద్రపోవడం మంచిది. దీనివల్ల మీ చర్మం శ్వాస తీసుకోవడానికి, గాయాలు చేయడానికి సహాయపడుతుంది.
మానసిక స్థితి మెరుగు
బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బట్టల ఒత్తిడి, అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నగ్నంగా నిద్రపోవడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు కూడా. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.