సైలెంట్ మైగ్రేన్లు సైలెంట్ కిల్లర్స్ కావొచ్చు.. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
సైలెంట్ మైగ్రేన్లు నొప్పిని కలిగించవు. కానీ ఇవి మిమ్మల్ని బలహీనపరుస్తతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిని నివారించాలంటే దీని లక్షణాలను తెలుసుకోవాల్సిందే?

migraine
ఈ రోజుల్లో తలనొప్పి సర్వ సాధారణమైన సమస్య. ఇది తల, ముఖం, ఎగువ మెడలో నొప్పిని కలిగిస్తుంది. అయితే చాలా మంది మైగ్రేన్ నొప్పిని కూడా తలనొప్పిగా భావిస్తారు. కానీ మైగ్రేన్ కు, తలనొప్పికి తేడా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి భరించలే విధంగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. లక్షణాల కారణంగా కొన్ని మైగ్రేన్లను గుర్తిస్తే.. ఇంకొన్నింటిని గుర్తించలేం. ఇవి నిశ్శబ్ద మైగ్రేన్లు. ఇవి ప్రమాదకరమైనవి.
మహిళకే మైగ్రేన్ రిస్క్ ఎక్కువ
మైగ్రేన్ అనేది తలనొప్పికి చాలా సాధారణ రకం. కానీ మైగ్రేన్ నొప్పి భరించలేని విధంగా వస్తుంది. జర్నల్ ఆఫ్ హెడేక్ అండ్ పెయిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. భారతీయ జనాభాలో మైగ్రేన్ మొత్తం 1 సంవత్సర ప్రాబల్యం 25 శాతానికి పైగా ఉందని కనుగొన్నారు. మైగ్రేన్ ఉన్న పురుషులు, మహిళలు తీవ్రమైన తలనొప్పికి గురవుతారు. ప్రపంచవ్యాప్తంగా 18-25 శాతం మంది మహిళలకు మైగ్రేన్లు వస్తాయని కనుగొనబడింది. ఇది మహిళలకే ఎక్కువగా వస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
migraine
సాధారణ మైగ్రేన్ కంటే నిశ్శబ్ద మైగ్రేన్ మరింత ప్రమాదకరం
ఒక సాధారణ మైగ్రేన్ ప్రోడ్రోమల్ దశతో ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు తీవ్రమైన అలసట, ఆవలింతలు, కడుపు నొప్పి మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. నిపుణుల ప్రకారం.. కాంతిని చూడలేకపోవడం, మైకము, అసమతుల్యత, గందరగోళం లేదా కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి వస్తుంది.
సాధారణంగా 30 శాతం మందికి ఈ నొప్పి 15 నుంచి 60 నిమిషాలు వస్తుంది. వికారం, వాంతులు, కాంతి, ధ్వనికి సున్నితత్వంతో సంబంధం ఉన్న తీవ్రమైన ఒకపక్క తలనొప్పితో బాధపడతారు. ఇది కొన్ని సార్లు రోజుల తరబడి ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలుగుతుంది. మరెన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఈ నొప్పి 3 రోజుల వరకు కూడా ఉంటుంది. అయితే లక్షణాలు తగ్గిన తర్వాత రోగి బలహీనంగా మారుతాడు.
అయితే కొన్ని సార్లు మైగ్రేన్ నొప్పిని కూడా తలనొప్పిగా భావిస్తారు. కానీ ఇవి తప్పనిసరిగా నొప్పిని కలిగించవు. అందుకే వీటిని "నిశ్శబ్ద మైగ్రేన్లు" అంటారు. ఈ మైగ్రేన్ 20 నుంచి 30 ఏండ్ల వారికి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే పెద్దవారిలో నిశ్శబ్ద మైగ్రేన్లు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మైగ్రేన్ కుటుంబ చరిత్ర ఉన్నా నిశ్శబ్ద మైగ్రేన్ తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి వస్తే బ్రెయిన్ స్కాన్ చేయడం మంచిది. వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నిశ్శబ్ద మైగ్రేన్లు ఎలా తగ్గించాలి?
నిశ్శబ్ద మైగ్రేన్లకు చికిత్స సాధారణ మైగ్రేన్ కంటే భిన్నంగా ఏం ఉండదు. పారాసిటమాల్, నాప్రోక్సెన్ వంటి పెయిన్ కిల్లర్స్ తో దీనిని తగ్గించుకోవచ్చు. ఈ నొప్పి తరచుగా వస్తుంటే బీటా-బ్లాకర్స్, ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్ వంటి సూచించిన మందులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.